ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో టీ లవర్స్ (Tea Lovers) ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే, నీరు (Water) తర్వాత ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం టీ నే! ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రిపేర్ చేసినా, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ (Main Ingredient) మాత్రం తేయాకు పొడే (Tea Powder). కానీ ఒక విషయం గమనిస్తే, ఇతర దేశాల్లోని ప్రజలు రెగ్యులర్‌గా తాగే టీలో పాలు (Milk) కలపరు.
మరి ఇండియాలో (India) మాత్రం ఎక్కువగా పాలతో చేసిన మిల్క్ టీనే (Milk Tea) ఎందుకు తాగుతారు? ఈ తేడా ఎలా వచ్చిందో తెలుసుకుందాం. టీ మన భారతదేశంలో పుట్టలేదు. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో (British) పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది.
చైనాకు పోటీగా: ప్రపంచ టీ వ్యాపారంలో చైనా ఆధిపత్యంతో (Dominance of China) పోటీ పడటానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company) అస్సాం, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీ సాగును (Massive Tea Cultivation) ప్రారంభించింది.
ఎగుమతి కోసమే: మొదట్లో ఈ టీని భారతీయుల కోసం సాగు చేయలేదు. కేవలం ఎగుమతి కోసం, మరియు బ్రిటిష్ ఉన్నత వర్గాల (British Elite Class) కోసమే పండించారు.
మార్కెటింగ్ వ్యూహం: 1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులకు టీ గురించి ప్రచారం (Promoting) చేయడం ప్రారంభించారు. దానిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర (Milk and Sugar) యాడ్ చేయాలని సూచించారు. ఈ ఐడియా అద్భుతంగా క్లిక్ అయింది!
బ్రిటిష్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయినా, భారతీయులు ఆ మిల్క్ టీని తమదైన విధంగా సరికొత్తగా ఆవిష్కరించారు.
అనవసరమైనది కాదు: ఇండియాలో ప్రతి కిచెన్‌లో పాలు ఉండాల్సిందే. చాలా రకాల డ్రింక్స్, స్వీట్స్ తయారీలో పాలు మెయిన్ ఇంగ్రీడియెంట్. టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్ బలంగా పెనవేసుకుపోయింది.
క్రీమీ ఫీలింగ్: పాలు టీని క్రీమీగా (Creamy) చేస్తాయి. పాలలో ఉండే కొవ్వు (Fat) తేయాకులో ఉండే చేదును తగ్గించి, ఒక మృదువైన (Smooth) రుచిని ఇస్తుంది. చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీంతో టీ కేవలం ఒక డ్రింక్ (Drink) కంటే, ఒక మంచి ఫీలింగ్‌గా మారింది. రిలాక్స్ కావడానికి ఇది బెస్ట్ వే అయింది.
భారతదేశం అంతటా టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతంలో ఓ కొత్త రకం టీ తయారైంది. ఇదే మసాలా చాయ్ (Masala Chai) ఆవిర్భావానికి దారి తీసింది.
సుగంధ ద్రవ్యాల మేళవింపు: కొందరు స్పైసీ కిక్ (Spicy Kick) కోసం అల్లం (Ginger), మరికొందరు సువాసన (Aroma) కోసం లవంగాలు (Cloves), ఏలకులు (Cardamom), దాల్చిన చెక్క (Cinnamon) వంటి సుగంధ ద్రవ్యాలు కలపడం మొదలుపెట్టారు. ఈ సుగంధ ద్రవ్యాలు (Spices), పాల మిశ్రమం టీని 'మసాలా చాయ్'గా మార్చాయి.
సామాజిక బంధం: 20వ శతాబ్దం మధ్య నాటికి టీ స్టాళ్లు, చాయ్‌వాలాలు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రైల్వే స్టేషన్ల (Railway Stations) నుంచి నగరంలో వీధి మూలల వరకు పొగలు కక్కుతున్న టీ దుకాణాలు వెలిశాయి. విద్యార్థులు, కార్మికులు, ప్రయాణికులు ఇలా అందరూ ఆ దుకాణాల వద్ద నిల్చుని టీ టేస్ట్ చేసి వెళ్తుంటారు.
కనెక్టింగ్ పాయింట్: భాష, మతం, ప్రాంతం వేరుగా ఉండే దేశంలో టీ అందరికీ కామన్ కనెక్షన్ అయింది. ఎందులోనూ సారూప్యత లేని ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి హాయిగా టీని షేర్ చేసుకుంటారు.
ఆసియా: చైనా, జపాన్ వంటి దేశాలలో టీ కల్చర్ (Culture) చాలా ప్యూర్, ఫోకస్డ్‌గా ఉంటుంది. అక్కడ టీ ఆకుపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ప్యూర్ టీ టేస్ట్ (Taste) చేయడానికి, కేలరీలు తగ్గించుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు.
యూరప్: బ్రిటిష్ వారు కూడా పాలు కలుపుతారు, కానీ చాలా తక్కువగా యాడ్ చేస్తారు. యూరప్ అంతటా టీ లైట్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది.
దీనికి విరుద్ధంగా, భారతదేశం టీని బోల్డ్, స్పైసీ మరియు సోషల్‌గా మార్చింది. అందుకే మన దేశంలో మిల్క్ టీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్!