Header Banner

ఏపీలో పేదలకు దసరా బంపర్ ఆఫర్! మంత్రి కీలక ప్రకటన!

  Thu May 22, 2025 07:03        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది. టిడ్కో ఇళ్లను దసరాకు లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని మంత్రి మండిపడ్డారు. అయితే ఎంత ఖర్చైనా సరే మహిళలకు టిడ్కో ఇళ్లు అందించాలనే చంద్రబాబు ఆదేశాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసినట్లు వివరించారు. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని.. గృహప్రవేశాలు చేయిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగ విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు.

 

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7000 కోట్లు కావాలని మంత్రి వివరించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారని నారాయణ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-2019 మధ్య సుమారుగా ఏడు లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించామన్న మంత్రి నారాయణ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని విమర్శించారు. 2 లక్షల టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అయితే ఎంత ఖర్చయినా సరే మహిళలకు టిడ్కో ఇళ్లు అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని.. ఈ క్రమంలోనే ఈ దసరాకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని నారాయణ వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి:  అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..! 

 

మరోవైపు పేదలకు సరసమైన ధరలోనే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో (Andhra Pradesh Township and Infrastructure Development Corporation - APTIDCO) పేరుతో ఈ కార్యక్రమాన్ని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు 300, 365, 430 చదరపు అడుగుల పరిమాణాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ. 4 లక్షలు, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ. 4.65 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ. 3 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో అందించనున్నాయి.

 

2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి పొందింది. వీటిలో 3,13,832 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా.. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని ఆరోపణలు ఉన్నాయి. ఇక 2023 నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా., భూమి సమీకరణ, మౌలిక సదుపాయాల కొరత వల్ల మిగతా చోట్ల టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 1.18 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ. 102 కోట్ల నిధులను బ్యాంక్ బకాయిల కోసం విడుదల చేసింది.

ఇక టిడ్కో ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉంటాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #DasaraOffer #HousingForPoor #TIDCOHouses #WomenEmpowerment