భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై (KTR) భాజపా ఎంపీ సీఎం
రమేశ్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సీఎం రమేశ్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. 
వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. “కేటీఆర్తో చర్చకు సీఎం రమేశ్ను నేను తీసుకొస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలి. భారత రాష్ట్ర సమితి కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాం.
ఆ పార్టీని భాజపాలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో ఇదే చెప్పారు” అని బండి సంజయ్ అన్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        