ప్రతి కార్యకర్తను పలకరించి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత జిల్లా పర్యటనలను కడప జిల్లా నుంచి ప్రారంభించారు.
పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం కడపలోని వాయుపుత్ర టీ స్టాల్ వద్ద చాయి పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు, పార్టీ నాయకులతో మాట్లాడి జిల్లాలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు ఆయనను సన్మానించారు.
పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తిరుమల తిరుపతి తొలి గడప కడప నుంచి తన పర్యటనకు శ్రీకారం చుడుతున్నానని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు చాలామంది రైతుల ఖాతాలో పడలేదని గత ప్రభుత్వం వైఫల్యం వల్ల కాస్త ఆలస్యమైందని తెలిపారు. త్వరలోనే సుఖీభవ డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        