Header Banner

పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్.. మరో నెల వరకు వాటికి నో ఎంట్రీ!

  Fri May 23, 2025 22:03        India

భారత గగనతలంపై పాకిస్థాన్‌కు చెందిన విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా భారత్ ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ మెన్ కు ప్రత్యేక నోటీసు (నోటమ్) జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం, జూన్ 23వ తేదీ వరకు పాకిస్థాన్‌లో రిజిస్టర్ అయిన విమానాలు, పాకిస్థానీ ఎయిర్‌లైన్స్ యాజమాన్యంలోనివి, లీజుకు తీసుకున్నవి లేదా ఆపరేట్ చేస్తున్న విమానాలు, అలాగే పాక్ సైనిక విమానాలు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించరాదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే పాకిస్థాన్ విమానాలు ఇప్పుడు భారత్‌ను చుట్టి ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు కూడా అధికమవుతాయి. జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ భూభాగంలో 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏప్రిల్ నెలాఖరులో ఇరు దేశాలు పరస్పరం తమ గగనతలాలపై ఆంక్షలు విధిస్తూ తొలిసారిగా నోటీసులు జారీ చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఇరుదేశాలు మరోసారి పొడిగించాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli