మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల కోసం ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్, పోలాండ్, యూఏఈ, ఒమాన్  మరియు స్వీడన్ నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు.