ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల కోసం విభిన్నమైన కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్‌లకు అభిమానులుండే దృష్ట్యా, రెండు ఆసక్తికరమైన చిత్రాలు ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చాయి. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘మార్గన్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో రూపొందిన థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక హిందీ భాషలో తెరకెక్కిన ‘మండల మర్డర్స్’ అనే క్రైమ్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో మర్డర్ మిస్టరీతో పాటు రాజకీయం, మానసిక ఒత్తిడికి సంబంధించిన అంశాలు కూడా కనిపించనున్నాయి.
వీటితో పాటు కొన్ని ఇతర చిత్రాలు కూడా ఈరోజు నుంచి ఓటీటీలోకి వచ్చాయి. ‘రంగీన్’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాగా, ‘సర్జామీన్’ అనే థ్రిల్లర్ డ్రామా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఇక మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ విడుదల చేయనున్నట్లు కొన్ని సినీ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. అధికారికంగా ప్రకటించాల్సినప్పటికీ, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        