ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది,ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటిం చాలని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు శుక్రవారం రెండో సారి ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది.
కాగా, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. ఓంఎసీకి అక్రమంగా మైనింగ్ లీజు అప్పగించారని కోర్టుకు తెలిపారు. ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీలక్ష్మి చొరవతీసుకున్నారని ఆరోపించారు.
పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి మాత్రమే లీజు మంజూరయ్యేలా చూశారని ధర్మాసనానికి తెలిపారు. ఆమె అక్రమాలకు పాల్పడ్డారని అనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాధారాలు పరిశీలించాకే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వెలువరించిందని కోర్టు దృష్టి తీసుకొచ్చారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        