ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పనితనాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన నూతన పద్ధతులు, సృజనాత్మక విద్యా కార్యక్రమాలు కేవలం పాఠశాలల్లోనే కాదు, సమాజానికి స్ఫూర్తి పంచుతాయి అని ప్రతినిధులు తెలపడం జరిగినది.
మంత్రి లోకేష్ ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో డిజిటల్ లెర్నింగ్, స్కూల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్, వంటి కార్యక్రమాల వివరాలను లోకేష్ వివరించడం జరిగినది. ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి చిన్న కిరణం వెలుగు పంచితే, సమాజం తేజోవంతం అవుతుంది అనే భావాన్ని వాస్తవంలో చూపుతున్నారని అన్నారు.
ప్రత్యేకంగా గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంది. చిన్నారుల్లో అక్షరాస్యత, అంకెల జ్ఞానం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు బలాన్ని అందిస్తున్నారని వారు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులకు ఇచ్చే స్కూల్ లీడర్‌షిప్ శిక్షణలు పాఠశాలల్లో నాణ్యత పెంచుతున్నాయి అని ప్రత్యేకంగా గుర్తించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ మోడల్‌ను అనుసరించాలి అని సూచించారు.
అలాగే SALT (Supporting Andhra's Learning Transformation) ప్రోగ్రామ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత విస్తారంగా, వినూత్నంగా అమలవుతుందని బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. ఇది భారతదేశం మాత్రమే కాదు, దక్షిణాసియా దేశాలకు రోల్ మోడల్ గా మారుతుందని అన్నారు.
విద్యార్థులు కు డిజిటల్ టూల్స్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ విషయాల్లో ఆసక్తి పెంచుకుంటున్నారు. అదేవిధంగా విద్యలో నీతి, శ్రమలో మేధావి ఇవాళ స్మార్ట్ క్లాస్‌లలో నిజమవుతోంది అని ప్రతినిధులు తెలపడం జరిగినది.
ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంక్ ఏపీ విద్యా రంగానికి మరింత ఫండింగ్, సాంకేతిక సపోర్ట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదేవిధంగా లోకేష్ కూడా అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు.