భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త ప్రతిష్టాత్మకంగా కేంద్రం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు ఇప్పుడు మరింత సౌకర్యాలను అందిస్తున్నాయి . ముఖ్యంగా చెన్నై – తిరునెల్వెలి రూట్‌లో నడుస్తున్న 27వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను అప్‌గ్రేడ్ చేసి, 16 కోచ్‌ల నుంచి 20 కోచ్‌లకు పెంచారు. దీంతో ప్రయాణికులకు 312 అదనపు సీట్లు లభ్యమవుతున్నాయి. మొదట 1128 సీట్లు ఉన్న ఈ ట్రైన్‌లో ఇప్పుడు మొత్తం 1440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న కీలక నిర్ణయం అని చెపుకోవచ్చు .
ఈ ట్రైన్ 2023 సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ చేత ఫ్లాగ్ ఆఫ్ చేయబడిన విషయం అందరికి తెలిసినదే . చెన్నై ఎగ్మోర్ నుంచి తిరునెల్వెలి వరకు 653 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. వారానికి ఆరు రోజులు అంటే
మంగళవారం మినహా అన్ని రోజులు అందు బాటులో ఉంటుంది. మార్గమధ్యంలో తిరుచిరపల్లి, దిండిగుల్, మదురై, విరుధునగర్, తాంబరం, విల్లుపురం స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టాపేజ్‌లు స్థానిక ప్రయాణికులకు ఉపయోగపడతాయి.
ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే – ఎప్పుడూ 90% పైగా ఆక్యుపెన్సీ ఉంటుంది. బిజినెస్ ప్రయాణాలు, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం వేలాది మంది రోజూ దీన్ని ఉపయోగిస్తున్నారు. కానీ టికెట్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్ లిస్ట్ సమస్య వస్తోంది. కొత్త కోచ్‌లతో ఇప్పుడు ఆ సమస్య కొంత తాగుతుంది అని చెపుకోవచ్చు . ముఖ్యంగా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడానికి మరింత అవకాశాలు పెరుగుతాయి అని అధికారులు తెలుపుతున్నారు.
సౌకర్యాల విషయానికి వస్తే, వందే భారత్ ట్రైన్‌లలో ఇప్పటికే ఏసీ, వైఫై, ఫుడ్ సర్వీస్, బయో-టాయిలెట్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు అదనపు కోచ్‌లు జోడించడం వల్ల మరింత మంది ఈ ఫీచర్లను మరింత మంది ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, స్థానిక ఎకానమీ, టూరిజంకి కూడా ఇది బూస్ట్ ఇస్తుంది. మదురై ఆలయాలు, తిరునెల్వెలి ప్రాంతాలు వంటి టూరిస్ట్ స్పాట్లకు వెళ్లే వారికి ఇది ఒక్క గొప్ప అవకాశం అని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.