AP ElectronicsManufacturing: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి కేంద్రం మరో బలమైన బూస్ట్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ (ECMS)–2025 కింద కేంద్ర ప్రభుత్వం రూ.765 కోట్ల పెట్టుబడిని ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ ప్రారంభం కానుంది. ఇది ఏపీలో పరిశ్రమల విస్తరణకు కొత్త దశను సూచిస్తోంది.
కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏడూ యూనిట్లకు ఆమోదం లభించింది. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. ఈ యూనిట్‌ను సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCB) తయారీ యూనిట్‌ను నిర్మించనున్నారు.
అంచనా ప్రకారం ఈ యూనిట్ ద్వారా 950 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఇంకా పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో నారా లోకేష్ కృషి ఫలితం ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రిలయన్స్, లులు గ్రూప్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులపై ఆసక్తి చూపిన విషయం ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. ఈ కొత్త ఎలక్ట్రానిక్స్ యూనిట్‌తో ఏపీ పరిశ్రమల మ్యాప్‌లో మరో ముఖ్యమైన బిందువు చేరనుంది.
ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి వచ్చే ఆర్థిక లాభాలు మల్టీ లేయర్ బోర్డులు తయారయ్యే ఈ యూనిట్ వల్ల స్థానిక సరఫరా గొలుసుకు చైతన్యం వస్తుంది. చిన్న, మధ్య తరహా యూనిట్లకు కూడా వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.
దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ కింద రూ.5,532 కోట్ల పెట్టుబడి తో మొత్తం ఏడూ యూనిట్లు నిర్మించనున్నారు. వాటిలో ఐదు తమిళనాడులో, ఒకటి మధ్యప్రదేశ్‌లో, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉండనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగా ఉపాధి లభించనుంది.
భారత ఎలక్ట్రానిక్స్ తయారీ దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే వచ్చే 3–4 సంవత్సరాల్లో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతుందని అని చెప్పడంలో సందేహమే లేదు.