Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు శుభవార్త. ప్రధాని గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద ఇళ్లు కట్టుకునే అవకాశాన్ని మరోసారి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. గతంలో సర్వేలో గుర్తించినా, పథకం వివరాలు తెలియక చాలామంది లబ్ధిదారులు దరఖాస్తు చేయలేకపోయారు. ఈ అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఫలితంగా కేంద్రం సానుకూలంగా స్పందించి పీఎంఏవై పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు గడువును నవంబర్ 5 వరకు పొడిగించింది. ఈ కొత్త అవకాశం ద్వారా ఇప్పటికీ ఇళ్లు పొందని అర్హులైన పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకునే వీలు కలిగింది.

AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!!

ఈ ఏడాది జూలై వరకు గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో పీఎంఏవై అర్బన్ 2.0, గ్రామీణ్ 2.0 పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టారు. 2024–2029 మధ్యకాలంలో గృహనిర్మాణ సహాయం అందుకునే వారిని గుర్తించడానికి ఈ సర్వే ముఖ్య పాత్ర పోషించింది. అయితే చాలామంది సాంకేతిక అవగాహన లేక లేదా పత్రాల లోపంతో నమోదు కాకపోవడంతో, ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇప్పుడు సీఎం జోక్యంతో మరోసారి అవకాశం లభించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ సారి ఎవరూ తప్పిపోకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Swarnamukhi River: స్వర్ణముఖి నది విషాదం..! మూడు మృతదేహాలు లభ్యం!

పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ.1.80 లక్షల వరకు సాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UDA) పరిధిలో ఉన్నవారికీ సమాన సాయం ఇవ్వాలని కోరినా, కేంద్ర ఆదేశాల ప్రకారం రూ.2.50 లక్షల సాయం కేవలం మున్సిపాలిటీల పరిధిలో ఉన్నవారికే వర్తిస్తుంది. ఈ క్రమంలో గతంలో నమోదు చేసుకున్నవారిని ఇప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా మళ్లీ నమోదు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు క్లియర్ కట్ ప్లాన్.. పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచే! సిలబస్, ప్రాక్టికల్స్‌లో కీలక మార్పులు!

అర్హులైన పేదలు తమ సమీప గృహనిర్మాణశాఖ కార్యాలయాల్లో నవంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి ఈ పథకం కింద సాయం పొందవచ్చు. దరఖాస్తు సమయంలో స్థలం పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి. ఈ గడువు అనంతరం దరఖాస్తులు స్వీకరించరని అధికారులు హెచ్చరించారు. కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

RTA Action: బస్సుల్లో భద్రతా ప్రమాణాలు చెక్ చేసిన అధికారులు..! సీజ్‌లతో బెంబేలెత్తిన ట్రావెల్స్..!
GOLD NEWS : భారత్ లో మూడో పెద్ద బంగారం మైన్ – ఏ రాష్ట్రం అంటే ?
మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక!
OTT Movie: థియేటర్ హిట్ ఇప్పుడు ఇంట్లోనే... 46 అంతర్జాతీయ అవార్డులు గెలిచిన స్పోర్ట్స్ డ్రామా!
Driving Test: విశాఖలో టెక్నాలజీ ఆధారిత లైసెన్స్ టెస్ట్..! ప్రతి తప్పు సిస్టమ్ రికార్డ్..!
Sharwanand : సూపర్ ఫిట్గా మారిన శర్వానంద్.. న్యూలుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్!