ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యార్థుల అటెండెన్స్ (హాజరు) విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అనారోగ్యం పాలైన విద్యార్థుల విషయంలో హాజరు నిబంధనలు సహేతుకం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట శాతం హాజరు లేని కారణంగా పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడాన్ని తప్పుబట్టింది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీలో బీటెక్ చదువుతున్న బీవీకే కౌశిక్ అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా గతేడాది కొన్ని రోజులు తరగతులకు హాజరు కాలేకపోయాడు. ఆ విద్యార్థికి హాజరు తక్కువగా ఉండటంతో కాలేజీ సిబ్బంది అతడ్ని మూడో సెమిస్టర్ పరీక్షకు అనుమతించలేదు. ఆ వెంటనే కౌశిక్ హైకోర్టును ఆశ్రయించారు. ఫలితాలు వెల్లడించేలా ఆదేశించాలని, నాలుగో సెమిస్టర్‌కు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరాడు. ఈ మేరకు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చింది. విద్యార్థి కౌశిక్ అనారోగ్యం కారణంగా తరగతులకు హాజరు కాలేకపోయారని.. వెంటనే ఆ ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు.
ఇది కూడా చదవండి: జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
అలాగే కౌశిక్‌ను తరగతులకు అనుమతించాలని జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జీఎంఆర్‌ఐటీ) కాలేజీ ప్రిన్సిపల్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆదేశించారు. మనిషి చేతుల్లో అనారోగ్యానికి ఎప్పుడు గురవుతామనేది ఉండదని.. మనిషి నియంత్రణలో లేని ఇలాంటి అంశాల్లో.. అనారోగ్యం పాలైన విద్యార్థుల హాజరు శాతంపై నిబంధణలు సరికాదని అభిప్రాయపడింది. విద్యార్థి పరిస్థితిని గమనించకుండా ఇంత శాతం హాజరు లేకపోతే పరీక్షలు రాయడానికి అనర్హులవుతారనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆ విద్యార్థికి నిబంధన పెట్టడానికి వీల్లేదు.. అలాంటి నిబంధన సహేతుకం కాదని వ్యాఖ్యానించింది. ఈ నిబంధన ప్రభుత్వం తీసుకురాలేదని.. ప్రైవేటు కాలేజీ తీసుకొచ్చిందన్నారు న్యాయమూర్తి. మానవ నియంత్రణలో లేని విషయాల్లో నిబంధనలు పెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం మీద హాజరు నిబంధనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రైవేట్ కాలేజీల్లో అటెండెన్స్ విషయంలో కొన్ని నిబంధనలు అమలుచేస్తున్నారు.. హాజరు సరిగా లేని వారిని పరీక్షలు రాయనీయడం లేదు. అయితే ఈ కేసులో మాత్రం విద్యార్థి అనారోగ్యం కారణంగా కాలేజీకి రాలేకపోయారు, పరీక్షలు రాయలేకపోయారు. అందుకే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: