తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు కలకలం సృష్టించాయి. పంప్ హౌస్ వద్ద 11 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో గుర్తించారు. చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోయింది.
సమీపంలోని పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీవినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను గంట పాటు నిలిపివేశారు.
రాష్ట్ర అటవీ, తితిదే, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఏనుగుల గుంపును అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది భక్తులను బృందాలుగా శ్రీవారిమెట్టు దగ్గరకు తరలిస్తున్నారు.