వైసీపీ అధికారం నిలబెట్టుకోవడానికి చెపుతున్న అబద్ధాలుకు అంతం లేదు.
రాష్ట్రం అన్ని రంగాలలో విఫలమైనా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ఈయన బహిరంగ సవరణలో చెబుతున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఈయన దొంగ సాక్షి టీం జిల్లాల వారీగా ప్రజలలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
విశాఖ కార్యనిర్వాక రాజధాని అని ఐదేళ్లుగా చెబుతున్న ప్రజలు చీకొట్టిన ఈయన బుద్ధి మాత్రం మారడం లేదు.
విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో యువతను సమీకరించి ప్రాంతి ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా ఒక పత్రిక చేయకూడని పనులను కూడా సాక్షి మీడియా చేపడుతుందంటే పత్రిక విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చారు.
ఈయన ఐదేళ్ల పాలనలో రెండు లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు యువతకు కల్పించామంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాష్ట్రంలో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా లేకుండా రెండు లక్షల మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారో ఈయన చెప్పాలి.
పారిశ్రామిక రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రగల్పాలు పలుకుతున్న ఈయన ఐదేళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారో చెప్పాలి.
తెలుగుదేశం ప్రభుత్వంలో వేగంగా విస్తరిస్తున్న టూరిజం రంగాన్ని కూడా ఈయన పాలనలో పాతరేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది ప్రతి రోజు వచ్చే పాపికొండల టూరిజనికి కరోనాతో రెండేళ్లు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వరదలలో బోటు పంపి మునిగిపోవడంతో రెండేళ్లు తాళాలు వేశారు.
దీనితో పాపికొండలు టూరిజం దినవస్థకు చేరింది.
ప్రపంచ దేశాలు దేవదేవుడిగా కొలిసే తిరుమల ఆలయ పవిత్రతను కూడా ఈయన మంటగలుపుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?
క్రైస్తవులను టీటీడీ చైర్మన్ గా నియమించి అసంబద్ధ నిర్ణయాలతో ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నారు.
స్వామివారిని ఎప్పుడు బడితే అప్పుడు ప్రజలు దర్శించుకునే వీలు లేకుండా అసంబద్ధ నిర్ణయాలతో దేవుడిని ప్రజలకు దూరం చేస్తున్నారు.
తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు కొండపై ఉండేందుకు ప్యాకేజీల సదుపాయం ఉన్న సామాన్య భక్తులకు అవి కేటాయించడం లేదు.
తిరుమల కొండను ఈయన పాలనలో పూర్తిగా తన రాజకీయ ప్రాబల్యాలకు మాత్రమే వాడుకుంటున్నారు.
లౌకికవాదం విధానాలతో ఉన్న రాష్ట్రంలో ప్రజలను కుల మత ప్రాంతాలుగా విభజించి వారిలో విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా ఈయన పాలన సాగుతోంది.
ఈయన పాలన ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జరిగిన నష్టం మరి ఎవరికీ జరగలేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆయా వర్గాలకు పాలనలో పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చి వారిపై పెత్తనానికి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నియమించుకునే పాలన సాగించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈయన పై వస్తున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను దోషులుగా చూపి కొత్త వారికి టిక్కెట్లు ఇస్తున్నారు.
ఈయన సొంత సామాజిక వర్గం కూడా ఈయన వ్యవహార శైలికి విసుగు పుట్టి బయటకు వస్తున్నారు.
ఈయన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధికి గాని రాష్ట్ర ప్రగతికి కానీ చేసింది శూన్యం.
ఈయన ఈ ఐదేళ్ల పాలనలో ఆదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు అందించిన దాఖలాలు లేవు.
వ్యవసాయ ఉత్పత్తులు పెరిగే విధంగా తీసుకున్న చర్యలు లేవు.
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
రైతు భరోసా కేంద్రాలు అంటూ రైతు ఉత్పత్తులపై కమిషన్ కేంద్రాలుగా వాటిని మార్చి రైతులను దోచుకోవడం తప్ప సాధించింది శూన్యం.
గ్రామాలలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని చెబుతూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు.
ఉదయం 8 గంటల నుండి రాత్రి పది గంటల వరకు సేవలందించే మీ సేవ కేంద్రాలను నిర్వీర్యం చేసి ఆ సేవలను గ్రామ వార్డు సచివాలయాలకు మళ్ళించారు.
గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంబంధించిన ఈ సేవకైనా లంచం లేకుండా పని జరగని పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు.
ఈయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం తప్ప సాధించింది శూన్యం.
ఈయనకి మరొక అవకాశం ఇస్తే రాష్ట్రం మరింత దిగజారి పోవడం తప్ప అభివృద్ధి కూడా కనపడదని ప్రజలు భావిస్తున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా!! కలిసి రావాలి! చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
జగన్ వచ్చాకే చంద్రబాబు విలువ తెలిసింది!లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం!!
వైసీపీ కొత్త ప్లాన్!! 30 రోజుల్లో రాష్ట్రాన్ని చుట్టేయనున్న జగన్!!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి