వైసీపీ అధినాయకుడి పై ప్రతిపక్షాలతో పాటు కుటుంబ సభ్యులకు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు.
చెల్లెలు షర్మిల ఈయన పై రాజకీయ పోరాటం చేస్తున్నారు.
మరొక చెల్లెలు సునీత ఈయన పై న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఈయన తల్లి వైయస్ విజయమ్మ మౌన పోరాటం చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఈయన పై ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈయన అపహాస్యం చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటానికి సిద్ధమయ్యారు.
ఇక ప్రజల విషయానికొస్తే ఈయన పాలన వైఫల్యాలపై ఐదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.
అమరావతి రాజధాని రైతులను అన్యాయం చేయవద్దు అంటూ ఎన్నికల ముందు చెప్పినట్లుగా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాలంటూ ఆ ప్రాంత రైతులు ఈయన పై పోరాటం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రజలు ఈయన పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎంతోమంది ప్రాణ త్యాగంతో ఏర్పడిన ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆ ప్రాంత ప్రజల మద్దతుతో జగన్ ప్రభుత్వం పై ఉద్యమిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన హామీ అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వం పై యుద్ధం చేస్తున్నారు.
పక్క రాష్ట్రం కంటే అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తానని అంగన్వాడి అక్క చెల్లెమ్మలను మోసం చేస్తున్న ఈయన పై అంగన్వాడి అక్క చెల్లెమ్మల ఉద్యమం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్ర సహజ సంపదలైన ఇసుక గ్రానైట్ మట్టి దోపిడీపై ప్రజలు... ఈయన ప్రభుత్వం పై యుద్ధం చేస్తూనే ఉన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రజల ప్రాథమిక హక్కులైనా వాక్ స్వతంత్రాన్ని కూడా హరించి వేస్తున్న ఈయన ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
భావవ్యక్తీకరణ చేస్తున్న ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పాలు చేస్తున్న ఈయన ప్రభుత్వ అంతమే మా పంతం అంటున్నారు రాష్ట్ర ప్రజలు.
ఈయన పై రాష్ట్రవ్యాప్తంగా పెల్లు భిక్కుతున్న ప్రజా వ్యతిరేకతతో ఈయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బాబాయ్ హత్య కేసులు ముద్దాయిలను నెత్తికెత్తుకుని కాపాడుతున్న ఈయన పై చెల్లెలు సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
తండ్రి ఆస్తిలో చెల్లెలు వాటాన్ని కూడా దిగమింగి మెడ పెట్టి బయటకు గెంటేసిన చెల్లెలు షర్మిల చేస్తున్న రాజకీయ పోరాటాన్ని కూడా ప్రజల స్వాగతిస్తున్నారు.
అధికారం కోసం అడ్డదారులు తొక్కిన జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు.
ఈయన పార్టీలో పోటీ చేసేందుకు కూడా ఆత్మాభిమానం కలిగిన ఎంతోమంది నాయకులు పార్టీని వదిలి బయటపడుతున్నారు.
ఈయన ఆకృత్యాలను బుజస్కందాలపై మోసిన ఎంతోమందినీ ఈయన వెన్నుపోటు పొడిచి బయటకు తన్నేసారు.
ఈయన కొంతమంది బయటకు తన్నితే మరి కొంతమంది ఈయనని తన్ని బయటపడ్డారు.
ఏది ఏమైనా అవినీతి అబద్ధాల పొట్టతో ఏర్పడ్డ వైసిపి పార్టీ నేడు పూర్తిగా ఖాళీ అయిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నవారు అమ్మకు చెల్లెళ్లకు కుటుంబానికి న్యాయం చేయడం చేతకాదు కానీ రాష్ట్రాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా కలర్ ఇస్తున్నారు.
2024లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడించడానికి వైయస్సార్ కుటుంబంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి