ఏపీలో వైసీపీ అధినాయకుడు ఐదేళ్లపాటు రౌడీ రాజ్యాన్ని కొనసాగించారు.

త్వరలో జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ఫ్యాక్షన్ నిజాన్ని అమలు చేయడానికి అన్ని సన్నాహాలు ఈయన పూర్తి చేశారు.

ఈ సారి పోలింగ్ రోజు ఎప్పుడూ చూడని ప్రాణనష్టం చూడబోతున్నాం..

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ల వద్ద దౌర్జన్యాలు హత్యాయత్నాలు హత్యలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

వైసిపి పార్టీ నుంచి పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా కూర్చునేది తెగించిన వాళ్ళే....

రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే ఏ పార్టీ కూడా కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోదు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఈయన ప్రతిపక్ష పార్టీలను కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేసిన దౌర్జన్యాలు ప్రజల కళ్ళముందే తిరుగుతున్నాయి.

వైసిపి పార్టీ గుండాలను ఎదుర్కొని నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన వారిని పోలీసులు ద్వారా అడ్డుకున్న ఉదంతాలు కూడా కోకొల్లలు.

గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్

వైసిపి దౌర్జన్యాలను ఎదుర్కొనే గెలుపొందిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీపీ జడ్పిటిసి మున్సిపల్ చైర్ పర్సన్ పోస్టులను వ్యవస్థలను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం సాధించింది.

అమరావతి రాజధాని విధ్వంసంతో కృష్ణ గుంటూరు జిల్లాలలో వెల్లువెత్తిన నిరసనల మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈయన గుండా గిరి తో ఆయా స్థానిక సంస్థలలో గెలుపొందారు.

అధికారం పరమావధిగా ఏ స్థాయికైనా జగన్ మోహన్ రెడ్డి దిగజారతాడు అనడానికి నిదర్శనమే జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికలు.

పోలీస్ రెవెన్యూ వంటి అత్యున్నతమైన వ్యవస్థల లో పనిచేస్తున్న అధికారులను అదిరించి బెదిరించి జగన్ మోహన్ రెడ్డి చేయని దుర్మార్గాలు లేవు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారుల బదిలీలలో కూడా ఈయన తనకు అనుకూలమైన అధికారులను అనుకూలంగా లేని నియోజకవర్గాలకు బదిలీ చేసి రెడీగా పెట్టుకున్నాడు..

ఐదేళ్ల కాలంలో ఈయన అక్రమంగా సంపాదించిన సంపదను వెదజల్లడం దీనికి తోడు వైసిపి ప్రైవేటు సైన్యం అధికార వ్యవస్థలో ఉన్న అధికారుల ప్రోత్సాహంతో గెలుపొందడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు.

ఐదేళ్ల ఈయన దుష్ట పాలనలో వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఈయన గెలిస్తే తెలుగుదేశం జెండా పట్టుకోడానికి ఎవ్వరూ రారు..

ప్రతిపక్షాల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈయన రాష్ట్రములో వందల మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు.

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

చివరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు పై కూడా తప్పుడు కేసులు పెట్టి చట్టానికి వ్యతిరేకంగా 54 రోజులపాటు జైల్లో ఉంచారు.

ఈయన ఇంత అరాచకానికి వెనుక ఉన్న ప్రధాన శక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు.

ఇన్ని రోజులు కార్యకర్తలను పోగొట్టుకున్నది చాలు.. ఇక మీద ఎవ్వరూ పార్టీ వల్ల దెబ్బ తినకూడదు.. అనే ఉద్దేశం అయి ఉంటుంది బాబు గారికి..

ఇక్కడ ఎంత చించేసుకున్నా.. చాలా చోట్ల ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది..

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

జనావాసాలలో తిరుగుతున్న క్రూర మృగాన్ని వేటాడడానికి అన్ని శక్తులు ఏకమైనట్లుగా విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి టిడిపి జనసేన బిజెపితో జట్టు కడుతుంది.

రాష్ట్రం పరిస్థితిని చూసి వైసిపి ఓటమి లక్ష్యంగా టిడిపి జనసేన ఓటమి గెలిచే వరకూ ఓర్చుకొని పవన్ కళ్యాణ్, చంద్ర బాబుకి సహకరిద్ధామనే తెలుగు తమ్ముళ్లు ఆలోచిస్తున్నారు.

లేకపోతే ఇక్కడే చించుకొని చించుకొని అలిసిపోయి.. మళ్ళీ టిడిపి కార్యకర్తలను పోగొట్టుకుందామా! చంద్రబాబు దూర దృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిద్దామా!

నికార్సైన తెలుగుదేశం కార్యకర్త, నాయకులు, రాష్ట్ర ప్రగతిని కోరుకునే ప్రజలు బాగా ఆలోచించాల్సిన విషయం..

జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు

నావరకు నేను బాబు గారు చెప్పిందే ఫైనల్ అని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకున్నప్పుడే దుష్ట పాలనకు చరమగీతం పాడవచ్చు.

మరి మీరు ఎటు వైపు.. బాబు గారి వైపా లేక.. ????

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group