కువైట్: వీసా ఉల్లంఘించిన వారికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గురువారం క్షమాభిక్షను ప్రకటించింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మరియు తాత్కాలిక ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఫహద్ యూసఫ్ అల్ సబాహ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. MoI ప్రకారం, రెసిడెన్సి ఉల్లంఘించిన వారు జరిమానా కట్టి వారి రెసిడెన్సీ ని తిరిగి పొందవచ్చు. రెసిడెన్సి ఎక్స్పైర్ అయిపోయి తమ దేశానికి వెళ్ళాలి అనుకునేవారు ఎలాంటి శిక్షలు లేకుండా, వారి పేరుని బ్లాక్ లిస్ట్ చేయకుండా తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పిస్తుంది. రెసిడెన్సీ గడువు తీరిపోయిన వారు ఫైన్ కట్టి రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఈ ఫైన్ గరిష్టంగా 600 KD లు ఉంటుంది.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రకటించిన ఈ క్షమాభిక్ష మార్చి 17, 2024 నుండి జూన్ 17, 2024 వరకు అమలులో ఉంటుంది. ఈ 90 రోజుల్లో కువైట్ వదిలిపెట్టి వెళ్ళినవారు తిరిగి కువైట్ లో ప్రవేశించవచ్చు. ఇప్పుడు ఇచ్చిన క్షమాభిక్ష ను ఉపయోగించుకోకపోతే గడువు ముగిసిన తర్వాత వీసా ను ఉల్లంగించిన వారిని అరెస్టు చేయడం, దేశం నుండి బహిష్కరించడం, వారి పేరుని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వారు తిరిగి కువైట్ లో ప్రవేశించే అవకాశం ఉండదు అని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 1,20,000 మంది ప్రవాసులకు ఉపయోగం ఉంటుంది అని తెలిపారు.
చిలకలూరిపేట టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు!
రెసిడెన్సీ రెన్యూవల్ చేయించుకోవడం ఎలా?
రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు ఈ 90 రోజులలో చట్టపరమైన నిబంధనలు పాటించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్సీ కు రిజిస్టర్ చేసుకొని, వారు నిర్దేశించిన ఫైన్ కట్టి మీ రెసిడెన్సీ ని తిరిగి పొందవచ్చు.
తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేశం నుండి వెళ్లిపోవాలి అంటే?
వీరికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. టికెట్ బుకింగ్ చేసుకొని తమ దేశానికి తిరిగి వెళ్లిపోవచ్చు. భవిష్యత్తులో మళ్ళీ కువైట్ రావాలి అనుకుంటే వాచ్చే అవకాశం కూడా ఉంటుంది.
దేశం నుండి వెళ్ళాలి, కానీ పాస్ పోర్ట్ లేకపోతే?
వెంటనే ఇండియన్ ఎంబసీ కి వెళ్ళి EC (ఎమర్జెన్సీ సర్టిఫికేట్) అప్లై చేసుకోవాలి. EC కోసం ఎంబసీ అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే 2 నుండి 5 వర్కింగ్ డేస్ లో EC జారీ చేస్తారు. ఈ డాక్యుమెంట్ తో పాస్ పోర్ట్ లేకుండా తిరిగి భారత దేశానికి ప్రయాణించవచ్చు. ఈ టెంపరరీ పాస్ పోర్ట్ తయారు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు ఇండియన్ ఎంబసీ కి చెల్లించిన అవసరం లేదు. ఎంబసీ వారు ఈ ఎమర్జెన్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ను ఉచితంగానే అందిస్తారు.
మీ పాత పాస్ పోర్ట్ కాపీ కానీ లేదా ఇండియాలో మీకు సంబంధించిన ప్రూఫ్ అనగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా డాక్యుమెంటు తోపాటు మీ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి సంబంధిత పాము ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఇవ్వాలి.
ఎల్లుండి చిలకలూరిపేట రానున్న ప్రధాని మోదీ!! షెడ్యూల్ వివరాలు!!
నోట్: ఈ 3 నెలలు ఈ విషయం మీద క్రమం తప్పకుండా అప్ డేట్స్ ఉంటాయి. ఏదైనా ఇబ్బంది, లేదా ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వెబ్ సైటు లో ఇచ్చే అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఆమ్రేష్టీ కి సంబంధించిన ప్రతి వార్త కూడా తెలుగులో మీకు అందించడం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
ఫైబర్ నెట్ కేసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు!!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు ఫోన్!! విజయవాడ రావాలని పిలుపు!!
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ పిల్!! హైకోర్టులో జరిగిన విచారణ!!
ఏబీపీ సర్వేలో సంచలన ఫలితాలు!! తెలంగాణాలో ఎవరు??
సర్వే ఏదయినా కూటమిదే విజయం!! వైకాపాకి అంతిమయాత్ర ఖాయం!! నారా లోకేష్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి