సీట్ల సర్దుబాటుపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ బృందంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు 8 గంటల పాటు సుధీర్ఘంగా భేటీ కొనసాగింది. మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల మధ్య పొత్తు లెక్క తేలింది... సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం... టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్ సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్ సభ స్థానాల్లో... జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
బీజేపీ మంగళవారం ప్రకటించే రెండో విడత లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు నివాసం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ బయటకు వచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. నేడు మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి