నెలవంక కనిపించినట్లు ముస్లిం మతపెద్దల ప్రకతించారు. నెలవంక కనిపించడంతో ప్రారంభమైన రంజాన్ మాసం... నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం... ప్రపంచ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసలు రంజాన్ అంటే ఏమిటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు అనే వివరాలు తెలుసుకుందాం...
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే. సమస్త మానవాళికి మార్గనిర్దేశంగా ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెలరోజులు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా నిష్టగా ఉంటారు. ఆశలకు, కోర్కెలకు కళ్లెం వేస్తారు. ఆత్మను పరిశుభ్రం చేసుకుంటారు. మంచి పనులు, దానాలతో పుణ్యం సంపాదించుకునేందుకు పోటీ పడతారని చెప్పవచ్చు. రంజాన్ నెలలో ఓ వైపు ఉపవాసాలు, మరోవైపు ఖురాన్ పఠనంతో మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ పరిశుద్ధమౌతాయి. అల్లాహ్‌కు మరింత చేరువయ్యేందుకు రంజాన్ అత్యుత్తమ మార్గమని నమ్ముతారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే... ఇస్లాంలో ఉపవాసాలు రెండవ శకంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీని గురించి ఖురాన్‌లోని రెండవ సూరా అల్ బఖ్రాలో ప్రస్తావన ఉంది. మీ కంటే ముందు తరంపై ఉపవాసాలు ఎలా విధిగా అమలు చేయబడినవో అదే విధంగా మీపై విధిగావించబడిందని సూరహ్ అల్ బఖ్రాలో ఉంది. మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన ఏడాది తరువాత ముస్లింలపై ఈ ఉపవాసాలు విధిగావించబడ్డాయి.
దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?
సూర్యోదయానికి ముందు సెహ్రీతో ప్రారంభించి సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్‌తో ముగించేది ఉపవాసం. నిత్యం ఆచరించే ఐదు పూట్ల నమాజుతో పాటు రాత్రి వేళ తరావీ నమాజ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నమాజ్ ద్వారా 30 రోజులు ఖురాన్ పఠనం ఉంటుంది. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం నెలకు 29 లేదా 30 రోజులుంటాయి. ఇస్లామిక్ కేలండర్ చంద్రమానం ప్రకారం ఉంటుంది. షాబాన్ నెల 29వ రోజు చంద్రదర్శనమైతే 30వ రేజు నుంచి రంజాన్ ప్రారంభమౌతుంది. చంద్ర దర్శనం కాకుంటే షాబాన్ 30 రోజులు పూర్తయ్యాక రంజాన్ ఉపవాసాలు ప్రారంభిస్తారు. అదే విధంగా రంజాన్ నెల 29వ రోజు చంద్రదర్శనంతో ఉపవాసాల దీక్ష ముగించి 30వ రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. చంద్రదర్శనం కాకుంటే 30 రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తి చేసి మరుసటి రోజు ఈదుల్ ఫిత్ర్ పండుగ చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!
ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి