విధి నిర్వహణలో భాగంగా కెనడా వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎయిర్ హోస్టెస్ లు ఆచూకీ లేకుండా పోతున్నారు. గతేడాది ఏకంగా ఏడుగురు ఎయిర్ హోస్టెస్ లు అదృశ్యమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు మాయమయ్యారు. ఇటీవల మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ పీకే-782 విమానంలో ఇస్లామాబాద్ నుంచి కెనడా వెళ్లింది.
ఇంకా చదవండి: హెచ్-1బీ వీసా ప్రక్రియపై వైట్ హౌస్ కీలక ప్రకటన! భారతీయ ఐటీ నిపుణుల్లో ఆదరణ..
టొరంటోలో దిగిన అనంతరం ఆమె నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు టొరంటో నుంచి కరాచీ వెళ్లే విమానంలో ఆమె విధులకు హాజరు కావాల్సి ఉండగా, ఆమె ఎంతకీ రాకపోవడంతో అధికారులు ఆమె హోటల్ గదిని పరిశీలించారు. కృతజ్ఞతలు పీఐఏ అంటూ ఓ లేఖను, ఆమె యూనిఫాంను కనుగొన్నారు. ఆమె ఎటు వెళ్లిందో మాత్రం తెలియదు.
ఇంకా చదవండి: అమెరికా: అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక వింత సంఘటన! గాలిలో డోర్ తెరిచే ప్రయత్నం!
అయితే, అదృశ్యం అయిన ఎయిర్ హోస్టెస్ లు కెనడాలో స్థిరపడే ఉద్దేశంతో అక్కడే ఉండిపోతున్నారని భావిస్తున్నారు. కాగా, తమ సిబ్బంది కెనడాలో ఆచూకీ లేకుండా పోవడం కొత్తేమీ కాదని, 2019లో ఈ తంతు మొదలైందని పీఐఏ వెల్లడించింది. విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి కెనడా పారిపోయి అక్కడే స్థిరపడినట్టు తెలిపింది.
ఇంకా చదవండి: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టాటా గ్రూప్! ఇది కథ ఆఫర్ అంటే ఇంకెందుకు మరీ రెచ్చిపోండి!
ఆ ఉద్యోగి సలహాతో మిగతావాళ్లు కూడా కెనడా బాటపడుతున్నారని పీఐఏ వివరించింది. విదేశీయులకు కెనడాలో సులభంగా ఆశ్రయం లభిస్తుండడం కూడా తమ ఉద్యోగుల మిస్సింగ్ కు దారితీస్తోందని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అభిప్రాయపడింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: