భారతీయ ఐటీ నిపుణుల్లో ఆదరణ కలిగిన హెచ్-1బీ వీసా ప్రక్రియ మెరుగుదలకు అధ్యక్షుడు జో బైడెన్ చేయాల్సినదంతా చేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది… బ్యాక్‌లాగ్ గ్రీన్ కార్డ్‌లు, చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్ విధానానికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి బైడెన్ కృషి చేస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది… హెచ్-1బీ వీసా ప్రక్రియకు సంబంధించి మెరుగుదల చర్యలు తీసుకున్నామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ బుధవారం వెల్లడించారు.
ఇంకా చదవండి: అమెరికా: టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కొచ్చు అని నిరూపించిన మహిళ!
రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చినవారి ఇబ్బందుల పరిష్కారంపై పెట్టిన శ్రద్ధ... చట్టబద్ధంగా వచ్చినవారి విషయంలో చూపడం లేదనే భావనలో ఉన్న ఇండియన్ అమెరికన్లను ఉద్దేశించి ఆమె ఈ వివరణ ఇచ్చారు.
ఇంకా చదవండి: అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!
ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, మోసాలను అరికట్టేందుకు గత నెలలోనే ఒక నిబంధనను తీసుకొచ్చామని జీన్-పియర్ ప్రస్తావించారు. వీసా ప్రక్రియను మెరుగుపరిచే ప్రక్రియ కోసం చేయాల్సినదంతా చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: