మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు
- గురజాలలో జరిగే రా కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరిక
-ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే నా ప్రతి అడుగు : -లావు శ్రీ కృష్ణ దేవరాయలు
నారా లోకేశ్‍ను కలిసిన జలీల్ ఖాన్!
మార్చి 2వ తేదీన గురజాల వేదికగా జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి:
జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!!
ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా..
పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖాయం -ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి