ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు పతనమైంది. గతేడాదితో పోల్చితే ఒక్క స్థానం పతనమై 84వ ర్యాంకు నుంచి 85వ ర్యాంకుకు పడిపోయింది. ప్రఖ్యాత హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్-2024 నేడు విడుదలైంది.
గతేడాది భారత్ పాస్ పోర్టుతో 60 దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లే వీలుండేది. ఈ ఏడాది ఆ సంఖ్య 62 దేశాలకు పెరిగినప్పటికీ, ర్యాంకింగ్స్ లో భారత స్థానం పతనమైంది. భారత పర్యాటకులు వీసా లేకుండానే రావొచ్చంటూ గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్, మలేసియా, థాయ్ లాండ్ దేశాలు కూడా ప్రకటించాయి.
ఇక, హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్-2024 జాబితాలో ఫ్రాన్స్ నెంబర్ వన్ గా నిలిచింది. ఫ్రాన్స్ పాస్ పోర్టు ఉంటే 194 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా పై వరుసలో ఉన్నాయి.
గతేడాది పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా, ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ 101 నుంచి 102వ ర్యాంకుకు పడిపోయింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ఇటీవల భారత్ తో సై అంటే సై అంటున్న మాల్దీవులు హెన్లీ పాస్ పోర్టు జాబితాలో 58వ ర్యాంకులో కొనసాగుతోంది. మాల్దీవుల పాస్ పోర్టుతో 96 దేశాలకు వీసా లేకుండా నిరభ్యంతరంగా వెళ్లిరావొచ్చు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి