నేటి కాలంలో వచ్చే సందాపనకు, చేసే ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. సామాన్యులకు ఆదాయం తక్కు ఖర్చులు ఎక్కువైపోయాయి. ఐతే, ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
వాటిల్లో పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇందులో నెలకు రూ. 10 వేల పెట్టుబడితో మోచ్యూరిటి నాటికి రూ. 17 లక్షలు అందుకోవచ్చు. మంచి రాబడి పొందేందుకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి రాబడి ఉంటుంది. ఇందులో సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు.
ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. ఆర్డీ స్కీమ్‌లో వడ్డీ రేటు ప్రస్తుతం 6.7 శాతంగా ఉంది. పథకం మెచ్యూరిటీ పిరియడ్ ఐదేళ్లు. మంచి రాబడి కోరుకునే వారు మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో రూ. 17 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 10 వేలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ.10 వేల పెట్టుబడితో సంవత్సరానికి రూ. 1,20,000 జమ అవుతుంది. ఐదేళ్లకు పెట్టుబడి మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది.
ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో రూ.1,13,659 వస్తుంది. అప్పుడు అసలు వడ్డీ కలుపుకుని మెచ్యూరిటీ నాటికి రూ. 7,13,659 చేతికి అందుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. మెచ్యూరిటి నాటికి రూ.17,08,546 చేతికి అందుతాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!
టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: