పర్సనల్ లోన్, హోం లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్.. ఇలా సమయానికి అవసరమైన లోన్ ను తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటాం. కొన్నినెలలు క్రమంగా లోన్ చెల్లించినా.. మధ్యలో వచ్చే ఇబ్బందుల కారణంగా.. లోన్ ఈఎంఐ కట్టలేకపోతుంటారు కొందరు. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లు లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే జైలుకు వెళ్తారని బెదిరిస్తుంటారు. వాటికి భయపడి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే లోన్ ఈఎంఐ చెల్లించలేనంత మాత్రాన జైలుశిక్ష పడదంటోంది రిజర్వ్ బ్యాంక్. ఏదేని కారణాల చేత లోన్ ఈఎంఐ చెల్లించలేని క్రమంలో.. సులువుగా లోన్ ను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
* తీసుకున్న లోన్లను సకాలంలో కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ ఈఎంఐ కట్టనంత మాత్రాన జైలుకు వెళ్లరని, అది క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది.
* కానీ.. లోన్ చెల్లింపులకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే మాత్రం.. చట్టపరమైన పరిణామాలకు దారితీయొచ్చని తెలిపింది.
* లోన్ సకాలంలో చెల్లించకపోతే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. భవిష్యత్ లో మళ్లీ బ్యాంక్ నుంచి లోన్లు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా అధిక వడ్డీ ఉంటుంది.
* ఈఎంఐలను సకాలంలో చెల్లించని నేపథ్యంలో బ్యాంకుని సంప్రదించకపోతే.. బ్యాంకులు ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని, వేలం వేసే అవకాశం ఉంది.
* లోన్ కట్టలేక ఇబ్బంది పడుతుంటే బ్యాంకుకి వెళ్లాలి. అందుకు పరిష్కారమేంటో తెలుసుకోవాలి.
* మీ లోన్ టెన్యూర్ ను పెంచడమో లేక.. వడ్డీని తగ్గించడమో చేస్తుంది. ఇవి రెండూ కాకుండా లోన్ ను పూర్తిగా చెల్లించేందుకు సమయం ఇస్తుంది. అప్పుడు లోన్ ను చెల్లించడం ఈజీ అవుతుంది.
* లోన్లను చెల్లించకపోవడం క్రిమినల్ నేరం కాదని ఆర్బీఐ రూల్స్ చెబుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీలకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: