By - Ch. Raja Sekhar
14. మెయిడ్ మార్కెట్ – మంచి కువైటీ యజమానురాలు
శకుంతల గుంటూర్ జిల్లాకి చెందిన మహిళ. నాలుగు ఇళ్ళల్లో పని చేస్తూ, వచ్చింది సరిపోక, ప్రత్యామ్నాయం లేక రోజులు వెళ్ళదీస్తూ ఉంది. తను పని చేస్తున్న యజమనురాలి అమ్మాయి కువైట్లో ఏదో పెద్ద ఆయిల్ కంపనీలో పనిచేస్తుందని తెలిసి, తనకి కూడా అక్కడ పని ఇప్పించమని వేడుకుంది. నమ్మకంగా పనిచేస్తుంది, కష్టపడుతుంది కాబట్టి ఆమెకి తన కూతురి ద్వారా సహాయం చేద్దామనే నిశ్చయించుకుంది ఆ యజమానురాలు. అలా ఒక 6 నెలల కష్టంతో ఏజంట్లని సంప్రదించి, ఆమె కుటుంబ పరిస్థితి మెరుగు పడడం కోసమని తానే ఖర్చుపెట్టుకుని కూతురి ద్వారా అక్కడ ఏజెంట్లని సంప్రదించి ఒక కువైటీ ఇంట్లో పనికోసం ఆమెని ఫ్లైట్ ఎక్కించింది యజమానురాలు.
ఇంకా చదవండి: పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
కువైట్ ఏమి తెలియని, చదువుకోని వాళ్ళు, ఏదో నాలుగిళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఇలా వచ్చి ఆ ఆకాశ హార్మ్యాలు చూసి మైమరిచిపోతూ ఉంటారు. అలాగే ఉంది శకుంతల పరిస్థితి. ఎంతో అందంగా ఉన్నా ఆ కట్టడాలను కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తూ, తనని పనికోసం కేటాయించిన ఆ కువైటీ ఇంటికి వెళ్ళింది. అక్కడ అప్పటికే ముగ్గురు పని వాళ్ళు ఉండడం గమనించింది. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నారు. పిల్లలకని, వంటకని, బట్టలకని…
రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు ఈ ధనవంతులయిన కువైటీలు తలుచుకుంటే పనిమనుషులకి కొదవా.. ఈమె నాలుగో ఆమె ఇప్పుడు. కొన్నాళ్ళు అక్కడ పనిచేసిన తరువాత ఆ కువైటీకి తనకి పనివాళ్ళు ఎక్కువగా ఉన్నారనిపించింది. అందుకని శకుంతలని ఎవరికయినా పని మనిషి కావాలని తెలిపే కువైటీ కి లేదా బంధువులకి గాని అప్పజెప్పాలని యోచించింది. అదే సమయంలో తమ వాళ్ళకి ఎవరికో పనిమనిషి కావాలంటే ఉచితంగా శకుంతలని అక్కడికి పంపించింది. ఇలా ఆ కువైటీ మంచితనమో మరి శకుంతల అదృష్టమో కాని ఆమే మరో కువైటీ దగ్గరికి క్షేమంగా చేరి పని చేసుకుంటోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ కువైట్ వారు కూడా ఆమెను ఇంట్లో మనిషివలే చక్కగా చూసుకుంటూ ఆమెకు కావలసినవి సమకూస్తూ సమయానికి జీతం కూడా ఇస్తూ అప్పుడప్పుడు చేతి ఖర్చులకు అలాగే ఇంటి వద్ద ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆదుకుంటూ సొంత మనుషులలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కుటుంబ పరిస్థితి చాలా మెరుగైన స్థితిలో ఉంది. అదేవిధంగా ఆమె ఆ కువైటీ కుటుంబాన్ని దేవుడితో సమానంగా చూసుకుంటూ ఎవరు కనపడ్డా ఆ అరబి కుటుంబాన్ని గురించి పొగడ్తలతో ముంచేస్తుంది.
అయితే, అన్ని సందర్భాల్లో ఇలా జరగదు కువైటీలు అంతర్గతంగా ఈ పనిమనుషులపై వ్యాపారాలు చేస్తారు, వీరిపై అన్యాపదేశంగా కేసులు వేసి డబ్బులు లాగుతారు, లేదా చిత్రహింసలపాలు చేసి వీరిని ఎవరికీ కాకుండా చేస్తారు. ఇలాంటి ఎక్కువయిన పని మనుషుల కష్టాలు వీరిని ఉపయోగించుకుని కువైటీలు చేసే ఆగడాలు మరో భాగంలో…
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
9. గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: