టీడీపీ సభ్యత్వాలు ఒక కోటి దాటిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రాణ సమానమైన కార్యకర్తలను అభినందిస్తున్నానంటూ బహిరంగ లేఖ రాశారు. పసుపు జెండా పవర్, పసుపు సైన్యం సత్తా కలిస్తే కోటి సభ్యత్వాలు అని పేర్కొన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యమని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదును సూపర్ హిట్ చేసిన కార్యకర్తలు, ప్రజలు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. "విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా తయారైంది. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏపీ, తెలంగాణ, అండమాన్ సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు.

ఇంకా చదవండి: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

గత రికార్డులు తిరగరాస్తూ, కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం" అని నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగం అని పేర్కొన్నారు. పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్ అని తెలిపారు. అధినేత చంద్రబాబు పార్టీలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తారని లోకేశ్ వెల్లడించారు. "మంచి నిర్ణయం తీసుకుంటే పొగిడేది మీరే... ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ప్రశ్నించేది మీరే... అందుకే పార్టీలోని ప్రతి కార్యకర్త అధినేతే. కార్యకర్తల సంతోషమే చంద్రబాబుకు ఆనందం. ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి కార్యకర్తల ప్రస్తావన ఉంటుంది. ఇక, పార్టీలో లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (17/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!

18న ఏపీకి అమిత్ షా... రెండు రోజుల పర్యటన! అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత!

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం.. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ! వారిపై కేసు నమోదు!

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group