కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం "ఉద్యోగిని" పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కొన్ని వృత్తులలో పని చేస్తున్న మహిళలకు రూ.3 లక్షల వరకు రుణ సహాయం అందజేస్తారు. వంటనూనెల వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణ సహాయం అందజేస్తుంది. ఇందులో వెనుకబడిన తరగతుల మహిళలకు 50% సబ్సిడీ ఇస్తారు. అంటే రూ.3 లక్షల రుణం తీసుకుంటే రూ.1.50 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాలి. అదేవిధంగా, లోన్ తీసుకున్న మహిళా ప్రత్యేక కేటగిరీ లేదా సాధారణ వర్గానికి చెందినట్లయితే, రూ. 3 లక్షల రుణంపై గరిష్టంగా రూ.90వేల తగ్గింపు ఉంటుంది. అంటే లోన్ తీసుకున్న రూ.2.1 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాలి. ఈ పథకంలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి గ్రామాల్లో నివసించే మహిళలు ఈ పథకం కింద రుణాలు పొందే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: రాయలసీమను రతనాల సీమగా మారుస్తా - సీఎం చంద్రబాబు! నీటి పారుదలలో కొత్త ప్రణాళికలు!
అంతే కాకుండా ఈ పథకం ద్వారా మహిళా రైతులకు వడ్డీలేని రుణాన్ని కూడా అందజేస్తారు. ఈ పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తాయి. మహిళలు బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు పొందడమే కాకుండా, ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణ కూడా పొందుతారు. ఈ పథకం ద్వారా రూ.3 లక్షల రుణం పొందడానికి ఎలాంటి హామీ పత్రాలు అవసరం లేదు. దీనికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఈ పథకం కింద ఎవరు రుణం పొందవచ్చు?: ఈ పథకం కింద రుణం పొందాలనుకునే మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఒంటరి మహిళలు, వికలాంగులకు కుటుంబ ఆదాయ పరిమితి లేదు. ఈ రుణంలో వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా, రుణం పొందాలనుకునే మహిళలు గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి. అవసరమైన పత్రాలు.. ఈ పథకం కింద రుణం పొందేందుకు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చిరునామా ధృవీకరణ సర్టిఫికేట్, ఇన్‌కాం సర్టిఫికేట్, రేషన్ కార్డ్, PPL కార్డ్, కుల ధృవీకరణ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ తప్పనిసరి. ఎలా దరఖాస్తు చేయాలి.. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు సమీపంలోని బ్యాంకులకు వెళ్లి అవసరమైన పత్రాలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!
అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!
వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!
వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: