ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా మూడు పార్టీలకు చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఖరారు చేసారు. మూడో జాబితా పైన కసరత్తు తుది దశకు చేరింది. ఇదే సమయంలో పోస్టులు దక్కించుకున్న వారికి వేతనాలు ఖరారు చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం పైన పోస్టులు దక్కించుకున్న వారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం మూడో విడత నామినేటెడ్ పదవుల లిస్టు ప్రకటనకు సిద్దం అవుతోంది. ఈ పోస్టుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు/ బోర్డులను రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా యాదవ, పద్మశాలీ కార్పొరేషన్లను, రాజమండ్రి, అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లను ఎ కేటగిరిలో చేర్చారు. మిగిలిన కుల కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను బి కేటగిరిలో చేర్చడం పట్ల పలు విమర్శలు వినవస్తున్నాయి.
ఇంకా చదవండి: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
ఆర్‌టిసి జోన్ ఛైర్మన్లను కూడా ఎ కేటగిరి కింద ప్రభుత్వం చేర్చింది. ఏ కేటగిరి నామినేటెడ్ ఛైర్మన్‌కు నెలకు రూ.1.25 లక్షలుగా వేతనం నిర్ణయించారు. అలవెన్స్ లు, సహాయ సిబ్బంది నియామకం, వారి జీతభత్యాలు మొత్తమ్మీద నెలకు రూ.2,77,500 డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. 'బి' కేటగిరి ఛైర్మన్లు, బోర్డు ఛైర్మన్‌లకు నెలకు వేతనంగా రూ.60 వేలుగా నిర్ణయించారు. అలవెన్స్‌లు, సిబ్బంది జీత భత్యాలతో కలిపి మొత్తమ్మీద రూ.1,93,500 నెలకు డ్రా చేసే అవకాశం ఉంది. ఎ కేటగిరిగా పేర్కొన్న విభాగాల్లో డైరెక్టర్‌గా నియమించిన వారికి నెలకు రూ.20 వేలు వేతనంగా పేర్కొంది. బి కేటగిరి డైరెక్టర్లుగా ఎంత వేతనమనే విషయంపై ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. ఇదే సమయంలో మూడో విడత జాబితా పైన మూడు పార్టీల నుంచి పలువురు ఆశలు పెట్టుకు న్నారు. ఇప్పటికే ఈ లిస్టు పైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి ఈ లిస్టులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మూడో లిస్టులో కుల సంఘాలతో పాటు కీలకమైన ఆర్‌టిఐ ఛైర్మన్లు, ఎపిపిఎస్‌సి డైరెక్టర్లు, ప్రెస్ అకాడమీ, ఎస్‌విబిసి ఛానెల్ ఛైర్మన్, డిజిటల్ కార్పొరేషన్ తో సహా పలు సంస్థల డైరెక్టర్లను ఖరారు చేయనున్నారు. సంక్రాంతి వేళ ఈ జాబితా విడుదల చేస్తారని తొలుత భావించినా.. మరి కొంత సమయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఏ , బీ కేటగిరీ వారీగా సంస్థలు- పోస్టుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఇంకా చదవండి: పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!
అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!
వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!
వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: