పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్పై వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు. 'ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు.. ఆ తర్వాత మీ కథ ఉంటుంది' అని హెచ్చరించారు. జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు. వివిధ విచారణల్లో భాగంగా డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని జగన్ వద్ద వైకాపా నేతలు ప్రస్తావించారు. హెలిప్యాడ్ వద్ద ఆగిన జగన్.. డీఎస్పీని పిలిపించారు.
ఇంకా చదవండి: జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
డీఎస్పీ మరో ఇద్దరు సీఐలతో జగన్ వద్దకు వెళ్లారు. ఆయన్ను ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీఎస్పీ మౌనంగా విని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్రెడ్డిని ఇటీవల రెండు రోజుల కస్టడీలో విచారించారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి పలుమార్లు విచారించారు. వీరందరినీ డీఎస్పీనే విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ తన బాధ్యతలను నిర్వహిస్తుండగా అందరిముందు బెదిరించడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది.
ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!
అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!
వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!
వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: