తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ రహదారికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెళ్లిన నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి, అవమానకరంగా తిట్టారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైకాపా వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను తొలుత తిరువూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని హెల్ప్ అసుపత్రికి తరలించారు.
ఇంకా చదవండి: ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పల్లెపండగలో భాగంగా గోపాలపురం గ్రామంలో ఇటీవల సిమెంట్ రహదారిని వేశారు. ఈ రహదారి విషయంలో వైకాపా వార్డు సభ్యురాలు భూక్యా చంటి భర్త కృష్ణా, భూక్యా రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోంది. భూక్యా రాంబాబు తెదేపా గ్రామ కార్యదర్శిగా ఉన్నారు. కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుకు అడ్డంగా కంపలు వేసి ఎవరూ రాకపోకలు సాగించడానికి వీళ్లేదని భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణా, కుమారులు గోపి, రాజు అడ్డుకున్నారు. వివాదం పరిష్కరించాకే రహదారిపై రాకపోకలు సాగించాలని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రాంబాబు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం వచ్చారు. ఆయన దృష్టికి రహదారి విషయాన్ని రాంబాబు, తెదేపా నేతలు తీసుకెళ్లారు. కొత్తగా వేసిన రోడ్డుపై కంపలు వేసి అడ్డుకుంటున్నారని చెప్పడంతో... నేతలతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లారు. రాంబాబు తరపున ఎమ్మెల్యే వచ్చి.. భూక్యా కృష్ణా, చంటి కుటుంబాన్ని నిలదీయడంతో.. వివాదం పెద్దదైంది.
ఇంకా చదవండి: ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!
కొంత సేపటికి గొడవ సద్దుమణగడంతో... రహదారిపై ఎలాంటి కంపలు వేయొద్దని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన కొంతసేపటి తర్వాత భూక్యా చంటి... పురుగుమందు డబ్బా పట్టుకుని వచ్చి తాగేశానని చెప్పింది. దీంతో 108 వాహనంలో ఆమెకు తొలుత ప్రాథమిక చికిత్సను అందించి.. అనంతరం తిరువూరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. మహిళకు ప్రాణాపాయం లేదు. మరో 48 గంటలు పర్యవేక్షణలో ఉంచనున్నారు.
కొలికపూడి వివరణ తీసుకోండి: ముఖ్యమంత్రి
ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... కొలికపూడి నుంచి సమగ్ర వివరణ తీసుకోవాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!
పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!
పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!
సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..
ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?
విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!
రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..
రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!
తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..
రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!
పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!
కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!
అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!
పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: