టీడీపీ కార్యకర్తలు కోటిమందికి ప్రమాద బీమా కల్పించేలా యునైటెడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంవోయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో రూ.42కోట్లు చెల్లించారు.
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధిష్టానం బీమా సౌకర్య కల్పిస్తున్న సంగతి తెలిసిందే. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే చాలు.. రూ.5లక్షల బీమా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతోంది.. సంక్రాంతి వరకు సభ్యత్వాల నమోదును పొడిగించారు. ఇప్పటి వరకు 96 లక్షల సభ్యత్వాలు అయ్యాయి.. కోటి సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకుంది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన బీమాపై మరో ముందడుగు పడింది.
తెలుగు దేశం పార్టీ కార్యకర్తల బీమాకు సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ యునైటెడ్ ఇండియా కంపెనీతో ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నారు. ఈ మేరకు జనవరి 1 నుంచే ఇన్స్యూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ జరిగింది. ఈ ఎంవోయూ ఉండవల్లిలోని నివాసంలో జరగ్గా.. టీడీపీ తరఫున నారా లోకేష్, అటు యునైటెడ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యకర్తలు అందరికి ప్రమాద బీమా వర్తించనుంది. దేశ రాజకీయాల్లోనే కోటిమంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించిన తొలి పార్టీగా టీడీపీ నిలిచింది.. చరిత్రలో ఇది తొలిసారి అంటున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ, యునైటెడ్ ఇండియా కంపెనీ మధ్య ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమాను కల్పిస్తారు. ఈ మేరకు తొలివిడతలో రూ.42 కోట్లు పార్టీ యునైటెడ్ ఇండియా కంపెనీకి చెల్లించింది. ఈ ఒప్పందం ప్రకారం.. సభ్యత్వం తీసుకున్న ప్రతి తెలుగు దేశం పార్టీ కార్యకర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సారథిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ.138 కోట్లు కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు ఖర్చు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో కేసుల్లో ఇరుక్కుపోయిన పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వివిధ ప్రమాదాలతో ఇబ్బందిపడుతున్న కార్యకర్తల కోసం మరో స్పెషల్ స్పెల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఈ స్కూల్స్ బాధ్యతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దగ్గరుండి చూసుకుంటున్నారు. అంతేకాదు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు.. కార్యకర్తల సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు స్వయంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!
బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!
ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!
రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: