క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి.. ఇలాంటి పండుగల వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బాబులే కాదు.. ఈ రోజుల్లో మహిళలు, యువతులు కూడా మద్యం తాగుతున్నారు. అందరూ తాగుతున్నారని కాదు.. కొందరు తాగుతున్నారు. కాబట్టి.. ఇక మనం మందుబాబులు అనే పదం బదులు.. మద్యం ప్రియులు అని మాట్లాడుకోవాలేమో. సరే.. అసలు విషయానికి వస్తే.. ఏపీలో 11 మద్యం తయారీ కంపెనీలు.. ధరలు తగ్గించాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రభుత్వమే. ఎందుకంటే.. బ్రాండెడ్ మధ్య అనే పేరు చెప్పి.. ఈ కంపెనీలు.. మధ్యం ధరలను ఎక్కువగా ఉంచాయి. దాంతో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో.. ప్రభుత్వం ధరలు తగ్గించమని చెప్పింది. అలా.. ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ ఉంది. లిక్కర్ షాపుల నిర్వహణలో నేతలు పాలుపంచుకోవద్దని సీఎం చంద్రబాబు చెప్పినా.. చాలా మంది భాగస్వాములుగా ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. క్వార్టర్ మద్యాన్ని రూ.99కే అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. ఆ హామీ అమలు చెయ్యడం కష్టమైంది. కారణం.. కంపెనీలు ధరలను పెంచాయి. కొన్ని రోజులుగా ప్రభుత్వం మద్యం తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలించి.. మూడు కంపెనీలు.. ముందుగా ధరలను తగ్గించాయి. దాంతో ఆ కంపెనీల మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. తద్వారా ఆ కంపెనీలకు ఒక్కో బాటిల్‌పై వచ్చే లాభం తగ్గినా.. సేల్స్ పెరగడంతో.. భారీగా ఆదాయం రావడాన్ని మిగతా కంపెనీలు చూశాయి. తక్కువ లాభం, ఎక్కువ సేల్స్ అనే ఆర్థిక సూత్రాన్ని అవి కూడా పాయించాలని నిర్ణయించుకొని.. ధరలు తగ్గించాయి. మద్యం తయారీ కంపెనీల నిర్ణయం వల్ల క్వార్టర్ బాటిల్ కొనుక్కున్నవారికి.. ధర రూ.30 తగ్గుతుంది. అలాగే.. ఫుల్ బాటిల్ కొనుక్కున్న వారికి.. 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ ధర తగ్గుతుంది.
బాటిల్
పాత ధర (రూపాయల్లో)
కొత్త ధర (రూపాయల్లో)
మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్
220
190
మాన్షన్ హౌస్ బ్రాందీ హాఫ్ బాటిల్
440
380
మాన్షన్ హౌస్ బ్రాందీ ఫుల్ బాటిల్
870
760
రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్
230
210
రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ ఫుల్ బాటిల్
920
840
యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్
1600
1400
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: