విజయనగరం జిల్లాలో రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పథకాలకు కీలకమైన రేషన్ కార్డు కోసం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న గత ప్రభుత్వం మంజూరు చేయకుండా ఆలస్యం చేసింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుండి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
ఇంకా చదవండి: ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!
వాటిని అన్నింటినీ పరిశీలించి అర్హులకు సంక్రాంతి కానుకగా అందిస్తారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతోంది. ఇది పూర్తయ్యాక కార్డులన్నింటినీ ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం కార్డులన్నీ గత ప్రభుత్వం బొమ్మలతో ఉన్నాయి. వీటిని సమూలంగా మార్చబోతున్నారు. కొత్త కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 2 నుండి 28 వరకు గడువు తేదీ ఉంటుందని డి ఎస్ ఓ మధుసూదన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కమెడియన్ అలీకి ఊహించని షాక్! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి - ఎందుకు అంటే!
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: