టిడ్కోలో గత ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.25 వేలు తిరిగి ఇస్తామని గొప్పలు చెప్పిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం బకాయిల జాబితా పెరుగుతూనే పోయిందని చెప్పారు. లెక్కా పక్కా లేకుండా తమకు అనువైన బిల్లులే పేర్కొంటూ వచ్చారన్నారు. "ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత బకాయిలు రూ.7 వేల కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పారు.. మేం లెక్కలు చూస్తే రూ.1,14,000 కోట్లుగా తేలింది. సీఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు రూ.4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు రూ.36 వేల కోట్లు. రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి శాసన సభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. తర్వాత మూడోదిగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని పనేంటంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూడటం. దీని ద్వారా రాష్ట్రంలోని డబ్బును మళ్లించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది” అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: