ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లాల వారీగా ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. అందులో భాగంగా, జిల్లా స్థాయిలో నిర్వహించే ఉద్యోగ మేళాల్లో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో రేపు అంటే నవంబర్ 19న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి పలు అంశాలు వెల్లడించారు. కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఎమ్మిగనూరు రోడ్లో ఈ మేళా జరుగుతుంది. ఇందులో బీఎంఎస్ సెక్యూరిటీస్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, నవ భారత్ ఫర్టిలైజర్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
ఇంకా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఈ జాబ్ మేళాలో పదవ తరగతి నుంచి B.Sc, M.Sc, లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు పాల్గొనవచ్చు. మేళా ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 1.8 లక్షల వరకు జీతం ఉంటుందని అధికారులు వెల్లడించారు. జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే, అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్లో హాజరుకావాలని ఎక్కించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: