ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. పున్నమి ఘాట్ నుండి సీ ప్లేన్‌లో చంద్రబాబు ఇతర మంత్రులు ప్రయాణించి శ్రీశైలం చేరుకోనున్నారు. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ కు చేరుకుని ..12 గంటలకు సీ ప్లేన్‌లో ప్రయాణం ప్రారంభించి 12.45 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరిగి 2.20 గంటలకు సీ ప్లేన్ లో బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు విజయవాడ పున్నమిఘాట్‌కు చేరుకుంటారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు చంద్రబాబు సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించి.. శ్రీశైలం ప్రయాణించనున్న నేపథ్యంలో నిన్న సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: