దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో ఖాళీలు, అర్చక విభాగంలో ఖాళీల్ని కలిపి త్వరలో 500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. దీంతోపాటు అన్ని ఆలయాల ట్రస్ట్బర్డుల నియామకాలు చేపడతామన్నారు. దేవాదాయశాఖ కమిషనరేట్లో అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయాల్లో ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ రకం సరకులే వినియోగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతర విభాగాల్లో మానవ వనరుల వినియోగానికి సంబంధించి కేంద్రీకృత విధానం తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయాలకు అవసరమైన ఆవు నెయ్యి సరఫరాకు వీలుగా, దేశీయ గోవుల పెంపకంపై ఆసక్తి చూపేవారికి దేవాదాయశాఖ తరపున 5 శాతం సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రూ.50 వేలకు పైగా వార్షికాదాయం ఉన్న ఆలయాల్లో అర్చకుల వేతనం రూ.15 వేలకు పెంపు, వేదాధ్యయనం చేసిన వేద పండితులకు సంభావన కింద రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లించేలా ఉత్తర్వులిచ్చామన్నారు. ఆలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరు సభ్యుల నియామకానికి సంబంధించి త్వరలో ఆర్డినెన్స్ జారీ కానుందన్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
వివరాలు లేకుండా సమావేశానికి ఎలా వస్తారు?
‘వివిధ జిల్లాల్లో ప్రధాన ఆలయాల పరిధిలో ఎన్ని భూములు ఉన్నాయి? ఎన్ని భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు పొందారు?' అని అధికారులను మంత్రి అడిగారు. కొన్ని జిల్లాల అధికారులు ఆ వివరాలు చెప్పలేకపోయారు. రికార్డులు, వివరాలు లేకుండా సమావేశానికి ఎలా వస్తారు? మరీ ఇంత నిర్లక్ష్యమా? అని వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశం గురించి ముందే చెప్పినా తగిన సమాచారంతో రావాలని తెలియదా? అని ప్రశ్నించారు. భూముల విషయంలో ప్రతి 15 రోజులకూ ప్రగతి కనిపించాలన్నారు. ఆక్రమణలను తొలగించి, ఆయా భూముల్ని ఆలయాల ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: