ప్రవాసాంధ్రుల అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ మరియు సాధికారత పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NRT ల ఎదుగుదలకు మరియు సమస్యలకు అవసరమైన చేయూత మరియు ప్రోత్సాహం అందించేందుకు ఆయా దేశాల్లో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్డీ) తరఫున ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి దేశంలోనూ రాష్ట్రాల వారిగా మరియు నగరాల వారీగా ఈ నియామకాలు చేసి అక్కడ ఉన్న తెలుగువారిని ఒకే వేదిక పైకి తీసుకు రావాలని నిర్దేశించారు. వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవాసాంధ్రులందరినీ మాతృభూమితో అనుసంధానించేలా కార్యక్రమాలు అమలు చేయాలని, క్రమం తప్పకుండా విదేశాల్లోని తెలుగు వారందరితోనూ సమావేశాలు పెట్టాలని, కళలు, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా వారందరుని ప్రోత్సహించాలని అన్నారు.
NRT లో సాధికారితపై సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు, పూర్వ ఎన్ ఆర్ టి ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరి, పూర్వ డైరెక్టర్ రాజశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రస్తుత ఏపీ ఎన్ ఆర్ టి సీఈవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీరికి సమగ్ర పాలసీని తయారు చేసుకుని ముందుకుపోవలసిందిగా దిశా నిర్దేశం చేశారు.
ఇంకా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
ఇందులో భాగంగా, ఏపీఎన్ఆర్టీ ఐకాన్ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు కార్పస్ ఫండ్ గా 25 కోట్లు, గతంలో బకాయిలు ఉన్నటువంటి బిల్లులు క్లియరెన్స్ కి ఐదు కోట్లు, ఎమర్జెన్సీ ఫండ్ కి ఐదు కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. 40 అంతస్తుల జంట భవనం ఏపీ ఎన్నార్టీ ఐకాన్ టవర్ ని త్వరితగతిన ప్రారంభించి 2026 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏపీఎస్ఆర్టీ కోటా కింద ఎస్ఆర్ఐలకు ప్రతి రోజూ 100 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి దర్శన టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ దర్శనాలు గత తెలుగుదేశం హయాంలో మాదిరిగా ఒక ఎన్నారైతో పాటు ఇండియాలో నివసిస్తున్న ఒక బంధువు కి విఐపి దర్శనానికి అవకాశం ఇస్తారు. (అనగా 1+1 ఒక ఎన్నారై కి మరొక నాన్ ఎన్నారై.)
ఎన్నారైల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి ఏపీ ఎన్నార్టీ పర్యవేక్షణలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. డీజీపీ కార్యాలయంలోని ఎన్నారై పోలీసు సెల్ కు మరింత మందిని కేటాయించి అక్కడ వచ్చే సమస్యలను వెంటనే పూర్తి చేసే విధంగా పటిష్ఠ పరచాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ ఎన్నార్టీ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రతి తెలుగువాడు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేలా వారి కార్యక్రమాలు చేపట్టాలని అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క ఎన్నారై ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక ఎన్నారైనీ ఇంకొక పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి తీసుకు వచ్చే విధంగా ఉండాలని తెలిపారు. దీనికి ప్రభుత్వం నుండి ఏ విధమైన సహకారానికైనా కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై తదుపరి రివ్యూ డిసెంబర్ లో ఉంటుందని కూడా వెల్లడించారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: