కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ లను పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటికే అమరావతి మీదుగా రైల్వే లైన్ పనులను షరా వేగంగా చెయ్యాలని సంకల్పించిన కేంద్రం తాజాగా ఏపీ రాష్ట్రానికి మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక రైల్వే ప్రాజెక్ట్ విషయంలో రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కీలకమైన రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్ కు రైల్వే బోర్డు అనుమతి తెలపటంతో తొలి అడుగుపడింది. 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్ కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో రేపల్లె బాపట్ల మధ్య కొత్త రైల్వే లైన్ వేయటం కోసం మొదటి అడుగు పడింది. ఇప్పటికే మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైను పనులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు ఆగస్టులో రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. ఇక ప్రస్తుతం దానికి అనుసంధానంగా రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్ వేసేందుకు తొలి అడుగు పడినట్లయింది. రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో దివిసీమ ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోందని తెలుస్తుంది. మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ ఏర్పాటు జరిగితే విజయవాడతో సంబంధం లేకుండా... ప్రత్యామ్నాయ మార్గంగా ఇది మారనుంది.
ఇంకా చదవండి: నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్ ఇది సముద్ర తీరప్రాంతంతో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైన్ గా భవిష్యత్తులో ఉపయోగ పడే అవకాశం ఉంది. మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో ఈ రైలు మార్గమే కీలక మార్గం కాబోతుంది. అయితే ఈ రైల్వే కొత్త లైన్ కోసం చంద్రబాబు చాలా చొరవ చూపారు. కేంద్రాన్ని ఒప్పించి ఏపీ పురోగతికి అవసరమైన రైలు ప్రాజెక్టులను తెచ్చారు. మచిలీపట్నం-రేపల్లే మార్గం పూర్తయితే ఇటు చెన్నై - కలకత్తా మార్గంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది . అలాగే దూరం కూడా 100 కిలోమీటర్లకు పైగా తగ్గుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సరుకు రవాణా రైళ్లను విజయవాడ వైపు కాకుండా మచిలీపట్నం వైపుగా మళ్లిస్తే విజయవాడ జంక్షన్ రద్దీని కూడా తగ్గించవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఒంగోలు ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులువుగా మారుతుంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
దువ్వాడ బర్త్ డే స్పెషల్! మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దివ్వల మాధురి!
చంద్రబాబు ఇలాకాలో వైసీపీకి షాక్! మున్సిపల్ చైర్మన్ రాజీనామా!
మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: