రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీని కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. మరో నాలుగున్నరేళ్ల పాటు ఇలాగే పార్టీలో ఉంటే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న కొందరు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులు అంతా వరుసగా కండువాలు మారుస్తున్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం టీడీపీ, జనసేన పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సన్నిహితులు, అనుచరులు కూడా పార్టీ మార్పు నిజమేనని సంకేతాలు ఇస్తున్నారు. కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయన టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఆయన జిల్లా వైసీపీ కీలక నేతల సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: