రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్)ల అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ పనుల పూర్తికి రూ.524.70 కోట్లతో సీఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్తగా టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ నుంచి అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులకు రాజధాని పరిపాలన నగరంలో, సీడ్ యాక్సెస్ రహదారికి పక్కనే సిల్ట్, ఆపైన 12 అంతస్తులతో (ఎస్+12) 18 టవర్లు నిర్మిస్తున్నారు. 432 అపార్ట్మెంట్ యూనిట్లు(ప్లాట్లు) సిద్ధం చేస్తున్నారు. టెండర్లు పిలిచి, పనులు అప్పగించినప్పటి నుంచి తొమ్మిది నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టవర్లపై ఇప్పటి వరకు సీఆర్డీఏ రూ.444.05 కోట్లు వెచ్చించింది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
వైకాపా నిర్వాకం... రూ.268 కోట్ల అదనపు వ్యయం
వైకాపా ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి పనులు నిలిపేసింది. ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వాటిని మళ్లీ చేపట్టి, పూర్తి చేయాలంటే అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతోంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చేనాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. 2014-19 మధ్య వాటి నిర్మాణానికి సీఆర్డీఏ రూ.395.65 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా పోడియం, క్లబ్స్, వాటర్ సంప్ వంటి నిర్మాణాలు, ఫ్లోర్లు, ఫాల్ సీలింగ్ వంటి ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులు, రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, చిల్లర్ యూనిట్ల ఏర్పాటు వంటి పనులు మిగిలాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం రూ.80.38 కోట్లు వెచ్చించినట్లుగా చూపించారు. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చిన హడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు... తూతూమంత్రంగా కొన్ని పనులు చేయించింది. కానీ ఒక్క టవరూ అందుబాటులోకి రాలేదు. మొత్తం పనుల పూర్తికి పన్నులతో కలిపి రూ.524.70 కోట్లు ఖర్చవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. అంటే ఇప్పటికే ఖర్చు చేసి రూ.444.05 కోట్లు కలిపితే... రూ.968.75 కోట్లు అవుతుంది. వైకాపా ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల 18 టవర్ల నిర్మాణానికే అదనంగా సుమారు రూ.268 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: