ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కొత్తగా 500 శాఖలను ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం ముంబై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం శత వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి (ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐబీఐ) ఏర్పాటు చేశారు. 1955లో ఐబీఐని ఎస్బీఐగా మారుస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 1921లో 250 శాఖలు గల బ్యాంకు ఇప్పుడు 22,500 శాఖలకు పెరిగిందన్నారు. 2025 మార్చి నెలాఖరు నాటికి మరో 500 శాఖలతో మొత్తం ఎస్బీఐకి 23 వేల శాఖలు అవుతాయన్నారు.

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం! 

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

భారత్‌లో ఆర్థిక అసమానతలు ఉన్నాయని ఎగతాళి చేస్తున్న వేళ అత్యధికంగా ఎస్బీఐ.. 23 వేల శాఖలు కలిగి ఉండటం గ్లోబల్ రికార్డు అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకుల డిపాజిట్లలో ఎస్బీఐ 22.4 శాతం వాటా కలిగి ఉందని, 50 కోట్ల పై చిలుకు కస్టమర్లకు సేవలందిస్తున్నదని, ఐదో వంతు రుణాలు మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఎస్బీఐ డిజిటల్ పెట్టుబడులు పటిష్టంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతి రోజూ బ్యాంకు ద్వారా 20 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతాయన్నారు. ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం 1924లో ప్రారంభమైందని గుర్తు చేశారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group