దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. వాయు నాణ్యత అత్యంత దారుణంగా క్షీణించింది. మూడవ రోజు వరుసగా సీవియర్ కేటగిరీ నమోదు చేసింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన రెండవ నగరంగా ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఏడు గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498గా నమోదు అయ్యింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ 770గా రికార్డు అయ్యింది. ఢిల్లీలోని జహంగిర్‌పురి, బవానా, వాజిర్పుర్, రోహిణి, పంజాబీ బాగ్ ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో కాలుష్యం నమోదు అయ్యింది. ఢిల్లీలోని పాలమ్, సఫద్దార్‌జంగ్‌లో 500ఎం, 400ఎం విజిబులిటీ నమోదు అయ్యింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం ఆతిషి ఇవాళ తన ఎక్స్ అకౌంట్‌లో ప్రకటన చేశారు. ప్రైమరీ స్కూళ్ల పిల్లలకు క్లాసులు ఆన్‌లైన్‌లోనే కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు. మరో వైపు విజిబులిటీ సరిగా లేని కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు జాప్యం ఏర్పడుతోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: