తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని
ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో ముఖ్య విభాగమైన ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శశికాంత్ వల్లేపల్లి తానాలో మొదటి నుంచి మంచి దాతగా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమందికి తానా ద్వారా సహాయాన్ని అందించారు. ఎన్నో ప్రాజెక్టులకు ఆయన ఫండింగ్ కూడా చేస్తున్నారు. అంకితమైన సేవాభావం, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న శశికాంత్ వల్లేపల్లి కాంత్ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా వేలాది మంది విద్యార్థుల చదువుకు ఆయన సహాయాన్ని అందించారు. తానా ఫౌండేషన్ ట్రజరర్‌గాస కార్యదర్శిగా కూడా శశికాంత్ వల్లేపల్లి పనిచేశారు.
మరి కొన్ని తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విద్యా గారపాటి తానాలో కమ్యూనిటీకి సహాయం అందించేవారిలో మొదటిలైన్‌లో ఉండేమనిషి. కమ్యూనిటీకి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనివారికి సేవలందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి దాదాపు 75,000,00 డాలర్లను ఆయన ఇంతవరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. అమెరికాలో తానా కాని, నాటా కాని, నాట్స్ లేదా టిటిఎ లాంటి జాతీయ తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు వచ్చేవారి దాహాన్ని తీర్చేందుకు లక్షల రూపాయల విలువ చేసే మంచినీటి బాటిళ్ళను అందజేస్తున్నారు. ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా మహాసభల్లో 70,000 వాటర్ బాటిళ్ళను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో కలిసి తానా ద్వారా క్యాన్సర్ నిర్దారణ శిబిరాలను నిర్వహించి ఎంతోమందికి చికిత్సకు సహాయాన్ని అందించారు. గతంలో తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్‌గా మరియు న్యూజెర్సీ రీజియన్‌కు రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
వినయ్ మద్దినేని తానా ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ, ఇతర కమిటీల్లోనూ పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్న మనిషి. ప్రస్తుతం ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. మెట్రో అట్లాంటా ప్రాంతంలో చాలా చురుకైన కమ్యూనిటీ నాయకుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)కి అధ్యక్షుడిగా, బోర్డు చైర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్‌కి ట్రజరర్‌గా ఆయన ఎన్నికయ్యారు.
హెచ్-1బీ వీసా ప్రక్రియపై వైట్ హౌస్ కీలక ప్రకటన! భారతీయ ఐటీ నిపుణుల్లో ఆదరణ..
కిరణ్ గోగినేని కూడా తానాలో వివిధ పదవులను చేపట్టారు. అట్లాంటాకు చెందిన ఆయన 2019-2021 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించారు. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా), ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తానా ఫౌండేషన్ సభ్యునిగా ఉన్న ప్రస్తుతం ఫౌండేషన్ జాయింట్ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి:
రావయ్యా శ్రీ కృష్ణ దేవరాయ! నీ నడకతో, నీ నడత తో మా పల్నాడు పావనం!
పలు ప్రశ్నలతో సీఎం ను డిమాండ్ చేసిన నెట్టెం రఘురాం!!
వాయిదా పడ్డ శంఖారావం!! ప్రజాగళంతో చంద్రబాబు కొత్త పంథా!!
తప్పుకున్న మహాసేన రాజేష్!! కారణం వాళ్లేనా??
గురజాల "రా కదలిరా" సభలో చంద్రబాబు ప్రసంగం! తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకుపుడుతుంది..
పథకాల పేరుతో అప్పులు! పది శాతం పేదలకు 90% సొంత ఖాతాకి! నమ్మకం లేదా? ఒక సారి ఇది చూడండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి