మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవే. ఇవి మన శరీరానికి శక్తిని అందించడంతోపాటు కణాల మరమ్మత్తులకు ఉపయోగపడతాయి. కనుక ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. ప్రోటీన్లు అనగానే మనకు నాన్ వెజ్ వంటకాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇవే కాదు, ఇంకా అనేక ఆహారాల ద్వారా మనం ప్రోటీన్లను పొందవచ్చు. ఇక నాన్‌వెజ్ తిననివారు కూడా పలు శాకాహారాల ద్వారా ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు ఉదయమే అందేలా చూసుకుంటే దాంతో రోజంతా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రోటీన్లు మనకు పలు ఆహారాల్లో లభిస్తాయి.
స్మూతీలు..
స్మూతీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. బ్రాండ్‌ను బట్టి యావరేజ్‌గా 100 గ్రాముల ప్రోటీన్ పౌడర్‌ను స్మూతీ ద్వారా తీసుకుంటే సుమారుగా 70 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఉదయం స్మూతీ తాగాలని అనుకునేవారు అందులో ప్రోటీన్ పౌడర్‌తోపాటు పండ్లు, పాలకూర, పాలు వంటి ఆహారాలను చేర్చుకుంటే మంచిది. దీంతో ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే క్వినోవాను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా ప్రోటీన్లు సమృద్ధిగానే లభిస్తాయి. సుమారుగా 100 గ్రాముల క్వినోవాను తింటే 8 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే క్వినోవా ద్వారా ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక బరువు తగ్గేందుకు క్వినోవా ఎంతగానో సహాయపడుతుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాదంపప్పు..
బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. 100 గ్రాముల బాదం పప్పు ద్వారా సుమారుగా 21 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొట్టు తీసి తింటే మంచిది. వీటిని స్మూతీల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రోటీన్ల కోసం పీనట్ బటర్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీన్ని సలాడ్స్‌పై చల్లి తినవచ్చు. 100 గ్రాముల పీనట్ బటర్‌లో సుమారుగా 25 గ్రాముల మేర ప్రోటీన్లు ఉంటాయి. అలాగే చియా విత్తనాలను తీసుకుంటున్నా కూడా ప్రోటీన్లు సమృద్ధిగానే లభిస్తాయి. 100 గ్రాముల చియా విత్తనాల ద్వారా సుమారుగా 17 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఈ విత్తనాల ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
పనీర్..
పనీర్ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని తరచూ వంటల్లో వేస్తుంటారు. పలు బిర్యానీ వంటకాలు లేదా మసాలా వంటకాల్లో పనీర్‌ను వేస్తుంటారు. వాస్తవానికి పనీర్‌ను తరచూ తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల పనీర్‌ను తింటే 18 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. పనీర్ ద్వారా మనకు క్యాల్షియం కూడా సమృద్ధిగానే లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒక కోడిగుడ్డును తినడం ద్వారా కూడా ప్రోటీన్లు లబిస్తాయి. 100 గ్రాముల గుడ్లను తింటే సుమారుగా 13 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి. దీంతో శరీరానికి రోజంతా కావల్సిన శక్తి అందుతుంది. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!
2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!
ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..
ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: