మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మాంసం చాలా మందికి రోజువారీ ఇష్టమైన భోజనం. శాఖాహారం అంటే అంతగా ఇష్టపడని వారు రోజూ మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా సరే వెజ్‌తో నాన్ వెజ్ రెండింటికీ ప్రత్యేక కౌంటర్ ఉంది. కాగా.. దాదాపుగా ఎక్కువ జనాలు మాంసం తినడానికే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియులకు ఆదివారం పండగలాంటిది. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో ముక్క ఉండి తిరాల్సిందే. కాగా మనం తినే ఆహారాన్ని సరైన పద్ధతిలో పాటించాలి. ముఖ్యంగా మనం తినబోయే ఆహారానికి సరిపడని ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకోకూడదు. ఇక నాన్ వెజ్‌లో చాలా మంది ఇష్టంగా తినేవాటిలో మటన్ కూడా ఒకటి. దీని మాంసం మానవ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంకా చదవండి: బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పుతుందా? ఈ యోగాసనాలు ట్రై చేయండి!
కాబట్టి మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. మాంసాహార ప్రియులు ఎదురుగా మటన్ ఉంటే క్షణికావేశంలో ప్లేటు అన్నం మాయమైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది వివిధ వ్యాధుల కారణంగా, ముఖ్యంగా కొలెస్ట్రాల్, డయాబెటిస్, యూరిక్ యాసిడ్ మొదలైన వ్యాధుల కారణంగా మాంసం వినియోగాన్ని తగ్గించారు. వేలాది వంటకాల మధ్య ఆహార ప్రియులకు మటన్ మరో స్వర్గం. అయితే ఈ మటన్ భోజనం తర్వాత చాలామందికి తెలియకుండా తినే అనేక ఆహారాలు శరీరానికి చాలా ప్రమాదకరం. మటన్‌తో పాటు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. అందుకే మటన్ తో ఏమి తినకూడదో చూద్దాం. మటన్ లేదంటే చికెన్.. ఈ రెండింటిలో ఏదైనా తినే ముందు లేదంటే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. మటన్ తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మటన్ తిన్న తర్వాత తేనె తీసుకోకూడదు. ఎందుకంటే మాంసాహారం తిన్న వెంటనే తేనె తింటే కూడా శరీరం వేడెక్కుతుంది. సాధారణంగా చాలా మందికి భోజనం తర్వాత టిఫిన్, టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు మటన్ ఫుడ్ తీసుకోని తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పుడూ మటన్ తిన్న తర్వాత టీ తాగకూడదు. కారణం ఇది అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: