ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్లో సక్సెస్‌ఫుల్ కార్లు అనగానే కొన్ని మోడళ్లు అందరికీ గుర్తొస్తాయి. అలాంటి వాటిలో మారుతి సుజుకి డిజైర్ ఒకటి. ఈ కాంపాక్ట్ సెడాన్ యూనిక్ డిజైన్, మంచి రైడ్ క్వాలిటీ, పెద్ద బూట్ స్పేస్, 5 సీటింగ్ కెపాసిటీ, బెస్ట్ ఇంటీరియర్ స్పేస్, కంఫర్ట్ ఫీచర్లతో ఇంప్రెస్ చేస్తోంది. అయితే మారుతున్న కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు కంపెనీ న్యూ జనరేషన్ డిజైర్‌ను తయారు చేసింది. 2024 డిజైర్‌ను మారుతి సుజుకి నవంబర్ 11న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఏడాది మేలో అధికారికంగా లాంచ్ అయిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ఆధారంగా కంపెనీ కొత్త డిజైర్‌ను మంచి అప్‌గ్రేడ్స్‌తో డెవలప్ చేసింది. ఈ న్యూ జనరేషన్ 2024 డిజైర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మారుతి అరేనా షోరూమ్స్‌లో, మారుతి సుజుకి వెబ్‌సైట్‌లో రూ. 11,000 టోకెన్ అమౌంట్‌తో వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త డిజైర్‌లో ఎలాంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయో చూద్దాం.
కొత్త డిజైర్ ఫీచర్లు..
లేటెస్ట్ డిజైర్ ఇంటీరియర్ లేఅవుట్ మారింది. వెహికల్‌లో ఫ్రీస్టాండింగ్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. 2024 డిజైర్ మంచి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, ESP, ABS విత్ EBD, ISOFIX చైల్డ్ సీట్స్ వంటి స్పెసిఫికేషన్స్ దీని సొంతం. ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, కార్ లాకింగ్ ఆటో-ఫోల్డ్ ORVMలు, LED ఫాగ్ ల్యాంప్స్, 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, రియర్ డీఫాగర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్, ఆటో ఫోల్డింగ్ ORVMలు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ AC వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో లేటెస్ట్ ఎడిషన్‌ను తీర్చిదిద్దారు.
ఇంకా చదవండి: మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!
కొత్త మారుతి డిజైర్ డిజైన్ చాలా వరకు మారింది. అయితే సెడాన్ ఓవరాల్ షేప్, సైజు మాత్రం పెద్దగా మారలేదు. లేటెస్ట్ 2024 మారుతి డిజైర్ పొడవు 3,995 mm, వెడల్పు 1,735 mm, ఎత్తు 1,525 mm. కారు వీల్‌బేస్ 2,450 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm. డైమెన్షన్స్ పక్కన పెడితే, 2024 డిజైర్ ఎక్ట్సీరియర్‌లోని మిగతావన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. వెహికల్ ముందువైపు వర్టికల్ షేప్‌లో స్లాటెడ్ గ్రిల్ ఉంటుంది. దీంట్లో గ్లాస్ బ్లాక్ గ్రిల్‌తో ఫినిషింగ్ చేసిన క్రోమ్ ట్రిమ్.. స్లీకర్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ LED DRLలు, టర్న్ ఇండికేటర్స్‌ను ఇంటిగ్రేట్ చేస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ గ్లాసీ బ్లాక్ బెజిల్‌లో ఫిక్స్ అయ్యి ఉంటాయి. కొత్త డిజైర్ వెనుక వైపు కొద్దిగా మార్చిన టెయిల్‌గేట్‌లో Y-షేప్డ్ LED ఇంటర్నల్స్, టెయిల్‌ల్యాంప్స్ ఉంటాయి. 2024 డిజైర్ కారులో 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 81 bhp వపర్, 112 Nm పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న అవుట్ గోయింగ్ డిజైర్‌లో 1.2-లీటర్ 4-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనితో పోలిస్తే కొత్త ఎడిషన్ పవర్‌ట్రెయిన్ 8 bhp, 2 Nm తక్కువగా ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఉన్నాయి. ఈ వెహికల్ CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 69 bhp, 102 Nm టార్క్‌ను అందిస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ MT ఇంజన్ డిజైర్ కారు 24.79 kmpl మైలేజీ అందిస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ AMT మోడల్ 25.71 kmpl; 1.2-లీటర్ CNG MT మోడల్ 33.73 km/kg మైలేజ్ అందిస్తాయి. 2024 డిజైర్ ధర రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చు. ఇది ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్స్‌తో పోటీ పడనుంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: