ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) హవా నడుస్తోంది. చాలామంది తక్కువ ధరలో లభించే ఎస్‌యూవీలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఎస్‌యూవీల్లో బాగా పాపులర్ అయిన మోడల్స్‌లో టయోటా ఫార్చ్యునర్ (Toyota Fortuner) ఒకటి. కానీ దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే టయోటా కంపెనీ ఈ ఎడిషన్‌ను అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘మినీ ఫార్చ్యునర్’ (Mini Fortuner) పేరుతో సంస్థ త్వరలో కొత్త కాంపాక్ట్, అఫర్డబుల్ ఎస్‌యూని లాంచ్ చేయనుంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కార్‌ని రూపొందించనుంది. ఈ మినీ ఫార్చ్యునర్, రూ.30 లక్షలకు పైగా ఖరీదు చేసే ఫుల్-సైజ్ టయోటా ఫార్చ్యునర్ కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. 2024 నవంబర్ చివరి నాటికి ప్రొడక్షన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మినీ ఫార్క్చూనర్ విశేషాలు తెలుసుకుందాం.
ఫ్లెక్సిబిలిటీ కోసం కొత్త ప్లాట్‌ఫారమ్..
టయోటా మినీ ఫార్చ్యునర్ సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై తయారు కానుంది. ఈ కొత్త డిజైన్ వల్ల వెహికల్‌లో మల్టిపుల్ బాడీ స్టైల్స్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు సాధ్యమవుతాయి. ఫ్యూయల్ ఆప్షన్లు, డిజైన్ పరంగా కూడా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.
ఇంకా చదవండి: కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
ఫీచర్లు, ప్రత్యేకతలు..
టయోటా కంపెనీ ఈ లేటెస్ట్ వెహికల్ ఇంజన్ గురించి ఎలాంటి కచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. అయితే కొన్ని అప్‌డేట్స్, ఆప్షన్ల గురించి వార్తలు వస్తున్నాయి.
పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లు: మినీ ఫార్చ్యునర్ స్వచ్ఛమైన పెట్రోల్ ఇంజన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ రెండింటితో రావచ్చు. ఈ హైబ్రిడ్ ఆప్షన్ ఇన్నోవా హైక్రాస్‌లో ఉన్నటువంటి 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో కలిపి హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఎలక్ట్రిక్ వేరియంట్: టయోటా భవిష్యత్తులో మినీ ఫార్చ్యునర్ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. కొనుగోలుదారులకు ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్ కూడా లభిస్తుంది.
ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీ..
ప్రస్తుతం టయోటా ఫార్చ్యునర్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రత్యక్ష పోటీని ఎదుర్కోలేదు. ప్రత్యేకించి 2020లో ఫోర్డ్ భారత మార్కెట్‌లో కనుమరుగైంది. దీంతో ఫార్చ్యునర్ ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల వెహికల్ అమ్మకాలపై ప్రభావం చూపింది. ఉదాహరణకు టయోటా 2023 జనవరిలో ఫార్చ్యునర్ 3,698 యూనిట్లను విక్రయించింది. అయితే 2024 సెప్టెంబర్ నాటికి అమ్మకాలు 2,473 యూనిట్లకు పడిపోయాయి. అయితే మినీ ఫార్చ్యునర్ కాంపాక్ట్ SUV విభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio), మహీంద్రా థార్ రాక్స్ వంటి ప్రముఖ మోడళ్లతో పోటీపడుతుంది. విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందిన టయోటా కొత్త SUVలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, స్టైలిష్ డిజైన్‌తో బలమైన పోటీ ఇస్తుంది. టయోటా మహారాష్ట్రలోని తన కొత్త ఛత్రపతి శంభాజీ నగర్ ప్లాంట్‌లో మినీ ఫార్చ్యునర్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ఈ కాంపాక్ట్ SUV ఉత్పత్తి 2027 ప్రారంభంలో ప్రారంభమవుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: